కొందరు ముద్దుగుమ్మలకు గ్లామర్‌తో పని లేకుండా అవకాశాలు దండిగా వరించేస్తుంటాయి. కానీ ఇంకొందరికి మాత్రం అందాల ఆరబోతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, అవకాశాలు వరిస్తుంటాయి. ముద్దుగుమ్మ లావణ్య పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. అదీ ఇదీ అన్నీ ఉన్నా అమ్మడికి సరైన అదృష్టం దక్కడం లేదు. ఒకవేళ దక్కినా అది ఎంతో కాలం నిలవడం లేదు. తొలి సినిమా 'అందాల రాక్షసి'కే విషయమున్న హీరోయిన్ అనిపించుకుంది. ఆ తర్వాత మళ్లీ స్లో అయిపోయింది. 'భలే భలే మగాడివోయ్' సినిమాతో పుంజుకుంది. కానీ, ఆ తర్వాత అంతంత మాత్రంగానే ఉండిపోయింది. ఇక తాజాగా నిఖిల్‌తో 'అర్జున్ సురవరం' సినిమాలో నటిస్తోంది.
విడుదలకు నోచుకోలేక ఈ సినిమా అలా అలా వాయిదాలు పడుతోంది. అయితే, ఈ లోగా ఖాళీగా ఉండడమెందుకా.? అనుకుందో ఏమో కానీ, హాట్ హాట్ ఫోటో సెషన్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతోంది. తనలోని డిఫరెంట్ హాట్ యాంగిల్స్‌ని బయటకి తీసి, కెమెరాలకు పోజిస్తోంది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, రిజల్ట్ కోసం ఇదిగో ఇలా ఎదురు చూస్తోంది. తాజా పిక్ విషయానికి వస్తే, లైట్ బేబీ పింక్ శాటిన్ వేర్‌లో లావణ్య అందాలు కుర్రోళ్లను ఎలా రెచ్చగొడుతున్నాయో చూశారుగా. ఫేస్‌లో ఆ సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌కే అబ్బాయిలు బొక్క బోర్లా పడిపోతారనిపిస్తోంది.