లావణ్యమైన 'అందాల రాక్షసి'

By iQlikMovies - September 12, 2018 - 13:44 PM IST

మరిన్ని వార్తలు

'అందాల రాక్షసి' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాకే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత కొంచెం స్లోగా నడిచిన లావణ్య కెరీర్‌ 'భలే భలే మగాడివోయ్‌' సినిమాతో టర్న్‌ అయ్యింది. ఆ తర్వాత వరుసగా 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మళ్లీ లావణ్య కాస్త స్లో అయినట్లుగా కనిపించినా, తాజాగా మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌తో 'అంతరిక్షం' సినిమాలో లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. అలా కాస్త ఎత్తులూ, కాస్త పల్లాలతో కెరీర్‌ని నడుపుకుంటూ వస్తోందీ అందాల రాక్షసి. దాంతో పాటు సినిమాలో పెద్దగా గ్లామర్‌ స్కోప్‌ చూపించే అవకాశం లేనప్పటికీ, సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ తనలోని గ్లామర్‌ యాంగిల్స్‌ని ఫ్యాన్స్‌కి పరిచయం చేస్తుంటుంది. తాజాగా లావణ్య పోస్ట్‌ చేసిన ఈ ఫోటో విషయానికి వస్తే, వైట్‌ ట్రాన్స్‌పరెంటెడ్‌ కాస్ట్యూమ్‌లో వలమాటున అమ్మడి అందాలు కిర్రాకు పుట్టిస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS