రష్మిక బ్రేకప్‌ స్టోరీ: నేరం నాది కాదు

మరిన్ని వార్తలు

ప్రస్తుతం టాలీవుడ్‌లో రైజింగ్‌ బ్యూటీగా వెలుగొందుతోన్న ముద్దుగుమ్మ రష్మికా మండన్నా పెళ్లి బ్రేకప్‌ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. కన్నడ నటుడు రక్షిత్‌శెట్టితో రష్మికాకి ఏడాది క్రితం ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. కెరీర్‌లో బిజీగా ఉన్న కారణంగా ఒక ఏడాది తర్వాత వివాహం చేసుకుందామని ఒప్పందం చేసుకుంది ఈ జంట. 

అయితే ప్రస్తుతం ఈ రిలేషన్‌ కట్‌ అయ్యిందని, రక్షిత్‌తో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అని రష్మికా తల్లి చెబుతోంది. రక్షిత్‌ మాత్రం ఈ ఎపిసోడ్‌లో వఎవరూ రష్మికాని దోషిగా చూడొద్దు. అన్నీ త్వరలో సర్దుకుంటాయ్‌ అని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు, తప్ప పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. అలాగే రష్మికా నుండీ క్లారిటీ రావట్లేదు. రష్మికా విషయంలో రక్షిత్‌ పోజిటివ్‌గా కనిపిస్తున్నాడు. రష్మిక అమ్మ మాత్రం రక్షిత్‌పై అభాండాలు మోపింది. 

నిజానికి డిశంబర్‌లో రక్షిత్‌ - రష్మికా వివాహం జరగాల్సి ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో రష్మికా కెరీర్‌ చాలా జోరుగా ఉంది. యంగ్‌ హీరోస్‌కే కాకుండా, స్టార్‌ హీరోస్‌ కూడా రష్మికాకి అవకాశాలు ఇచ్చే యోచనలో ఉన్నారు. రష్మికా ఉంటే ఆ సినిమా హిట్టే అని లక్కీ ట్యాగ్‌ ఆమెకుంది. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. హీరోయిన్స్‌ విషయంలో ఈ నానుడి బాగా వర్తిస్తుంది. సో కెరీర్‌ ఇంత జోష్‌ మీదున్న ఈ తరుణంలో రష్మికా పెళ్లి ఆలోచన విరమించుకుంటుందా..? లేక రక్షిత్‌తో పూర్తిగా కట్‌ఇఫ్‌కే మొగ్గు చూపుతోందా? తేలాల్సి ఉంది. 

ఆల్రెడీ 'ఛలో', 'గీత గోవిందం' చిత్రాలతో హిట్‌ కొట్టిన రష్మికా 'దేవదాస్‌' చిత్రం కోసం ఎదురు చూస్తోంది. నానికి జోడీగా నటించిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS