డెబ్యూ మూవీ సూపర్ హిట్ రికార్డుంది. ఆ తర్వాత 'భలే భలే మగాడివోయ్' చిత్రంతో వరుస హిట్లు అందుకుని, వావ్ అనిపించుకుంది. ఎవరి గురించి చెబుతున్నామో అర్ధమయ్యే ఉంటుంది కదా. హా. అవును ఆమెనే అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. లావణ్య త్రిపాఠికి ప్రస్తుతం అంతగా కలిసి రావడం లేదు. వరుసగా మెగా కాంపౌండ్‌లో రెండు సినిమాల్లో నటించింది. కానీ ఒక్కటీ కలిసి రాలేదీ బ్యూటీకి. ప్రస్తుతం 'అర్జున్ సురవరం' సినిమాలో నటించింది. కానీ, ఆ సినిమా విడుదల అటూ ఇటూ కాకుండా పోయింది.
ప్రస్తుతం లావణ్య చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేవు కానీ, ఆమెలో మాత్రం జోరు తగ్గలేదు.. ఎంత ఉల్లాసంగా ఉందో. ఉత్సాహంగా ఉందో చూశారుగా.. హాయిగా ఆహ్లాదంగా ఫోటో సెషన్స్ చేయించుకుంటూ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటోంది. లావణ్య ఈ లేటెస్ట్ పిక్కి ఆహ్లాదమైన రెస్పాన్స్ వస్తోంది. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఆమె కాస్ట్యూమ్ సింప్లీ సూపర్బ్. సైడ్ కట్ని ఎక్స్పోజ్ చేసేలా మ్యాచింగ్ హై హీల్, సింపుల్ హెయిర్ స్టైల్‌తో అందాల రాక్షసి కవ్విస్తోంది. బ్యాక్ గ్రౌండ్లో బ్లూ కలర్ టోటల్‌గా పిక్కే హైలైట్ అయ్యింది.