'రాజ్‌ధూత్‌'కి హరీష్‌ శంకర్‌ సపోర్ట్‌!

మరిన్ని వార్తలు

తెరపై విలన్‌గా కనిపించినా, రియల్‌ లైఫ్‌లో మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఇండస్ట్రీలో మంచి పేరుంది శ్రీహరికి. ఆయన హఠాన్మరణం తర్వాత ఆయన్ని రీప్లేస్‌ చేసే నటుడు దొరకలేదు ఇండస్ట్రీకి. విలన్‌ అయినా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానైనా, కమెడియన్‌గానైనా ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు శ్రీహరి. అలాంటి గొప్ప నటుడు, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి వారసుడైన మేఘాంష్‌ శ్రీహరి 'రాజ్‌ధూత్‌' సినిమాతో డెబ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12న 'రాజ్‌ధూత్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో కాన్ఫిడెంట్‌గా వస్తున్న మేఘాంష్‌కి ఇండస్ట్రీ తరపు నుండి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నారు ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌. శ్రీహరిగారి రుణం తీర్చుకోవాలంటే ఆయన తనయున్ని ఆశీర్వదించాలనీ, 'రాజ్‌ధూత్‌'ని ఆదరించాలని హరీష్‌ శంకర్‌ ఓ వీడియో ద్వారా సోషల్‌ మీడియాలో స్పందించారు. ప్రచార చిత్రాల ద్వారా మేఘాంష్‌ బాగానే ఆకట్టుకుంటున్నాడు.

 

rajdoot embeded tweet

ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాడు. నక్షత్ర ఈ సినిమాలో మేఘాంష్‌తో జోడీ కడుతోంది. ఇదిలా ఉంటే, రాజశేఖర్‌ కుమార్తై శివాత్మిక, విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ డెబ్యూ చేస్తున్న 'దొరసాని', సరైన హిట్‌ కోసం ట్రై చేస్తూ సాహసం చేయరా ఢింభకా అంటూ సొంత నిర్మాణంలో సందీప్‌కిషన్‌ నటిస్తున్న 'నిను వీడని నీడను నేనే' చిత్రాలు కూడా ఇదే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సో ఈ మూడు చిత్రాల మధ్య పోటీ గట్టిగానే ఉందనిపిస్తోంది. చూడాలి మరి గెలుపెవరిదో. ఎవరిని విజయం ఎంత ఎక్కువగా వరిస్తుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS