'అందాల రాక్షసి' సినిమాతో అందంగా హాయ్ చెప్పిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే సమ్‌థింగ్ ఎట్రాక్టివ్ అనిపించింది. కానీ, తర్వాత కెరీర్ ఏమంత ఆశించినంతగా సాగలేదు. 'భలే భలే మగాడివోయ్' సినిమాతో మారుతి పుణ్యమా అని ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్లింది. ఏకంగా స్టార్ హీరో నాగార్జున సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసి, మంచి హిట్ కూడా తన ఖాతాలో వేసేసుకుంది. కెరీర్ జోరు మీదుంది కదా.. అనుకుంటే, మళ్లీ నత్త నడక మొదలైంది.
ప్రస్తుతం లావణ్య చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులేమీ లేవు. కానీ, ఆమె నటించిన 'అర్జున్ సురవరం' ఈ నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజా పిక్ విషయానికి వస్తే, గోల్డ్ చమ్కీలు పొదిగిన బ్లాక్ కలర్ కాస్ట్యూమ్ ధరించి, ఓ స్పెషల్ ఫోటో షూట్ చేయించుకుంది. సౌరకుటుంబంలోని పాల పుంతనే తన ఒంటిపై డ్రస్‌గా ధరించిందా.! అన్నట్లుగా ఉంది ఈ డ్రస్. వైట్ స్కిన్ టోన్ బ్లాక్ కాస్ట్యూమ్. రెడ్ కలర్ లిప్‌స్టిక్ ఆమె అందాన్ని హాట్ అండ్ బ్రైట్‌గా మెరిపిస్తోంది. రెండు చేతులూ నడుముపై ఉంచి, అమాయకపు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి ఎటో చూస్తోంది. నిజంగానే స్వచ్ఛమైన అందమంటే ఇదే అనిపించేలా ఉంది ఈ అందాల రాక్షసి వైనం చూస్తుంటే. ఇంకెందుకాలస్యం అర్జెంటుగా ఈ పిక్‌పై లుక్కేసి, ఈ అందాల రాక్షసి అందాల్ని ఆస్వాదించండి.