అప్పుడెప్పుడో 'దగ్గరగా దూరంగా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ వేదిక. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుంది. జూనియర్ నగ్మాగా పాపకి పేరుంది. కానీ, నగ్మాలా క్రేజ్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. అయినా ఎప్పుడు ఎవరి స్టార్ ఎలా తిరుగుతుందో తెలీదు కదా. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటోంది. లారెన్స్ పుణ్యమా అని, 'కాంచన 3' సినిమాతో మళ్లీ తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ సినిమాలో వేదిక పర్‌ఫామెన్స్ మెచ్చిన నందమూరి నటసింహం బాలయ్య తన 'రూలర్' సినిమాలో హీరోయిన్‌గా అవకాశమిచ్చారు.
అలా ప్రస్తుతం 'రూలర్'లో బాలయ్య సరసన ఛాన్స్ దక్కించుకున్న వేదిక, అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్‌తో యూత్‌ని ఉర్రూతలూగిస్తుంటుంది. తాజాగా బ్లూ కలర్ షార్ట్ మోడ్రన్ డ్రస్‌లో ఇదిగో ఇలా అందాలారేస్తూ కనిపించింది. బ్రైట్ బ్లూ కలర్ డ్రస్, మెరిసిపోతున్న స్కిన్ టోన్‌తో హై హీల్స్ ధరించి అజంతా శిల్పంలా ఓ పోజిచ్చి, కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేస్తోందిలా మరి.