గులాబీ రంగు కాస్ట్యూమ్‌లో అచ్చం అరవిరిసిన అందాల గులాబీ పువ్వులానే ఉంది ఈ ముద్దుగుమ్మ అందం ఈ ఫోటోలో. బ్యాక్ గ్రౌండ్‌లో గ్రీనరీ, గులాబీ రంగులో డ్రస్స్ ప్యాటర్న్ చాలా కొత్తగా, విభిన్నంగా డిజైన్ చేశారు. ఇంతకీ ఫోటోలో ఉన్నదెవరనేగా.. అందాల లావణ్య త్రిపాఠి. 'అందాల రాక్షసి'గా పరిచయమైంది. అప్పటి నుండీ తన అందంతో కుర్రకారును రాక్షసిలాగే కట్టి పాడేస్తోంది. ఇప్పుడీ అందాల రాక్షసి నటిస్తున్న చిత్రం 'ఇంటెలిజెంట్'. సాయి ధరమ్‌తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అమ్మడి గ్లామర్ కెవ్వుకేక అంటే.. ఈ సౌండ్ చాలా చిన్నదే అవుతుంది. అంతకుమించిన గ్లామర్‌ని పండించేస్తోంది మరి. ఇంతకుముందు చాలా చిత్రాల్లో లావణ్య గ్లామర్‌గా కనిపించింది కానీ, అది ఈ స్థాయిలో ఎంతమాత్రమూ అయ్యుండదనీ ఖచ్చితంగా చెప్పొచ్చు. 'ఇంటెలిజెంట్' పోస్టర్స్‌లో ఈ బ్యూటీ తన హాట్ అప్పీల్‌తో మతులు పోగొట్టేస్తోందంతే!