'అందాల రాక్షసి' సినిమాతో అందంగా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే క్యూట్ లుక్స్‌తో నిజంగా అందమైన రాక్షసిలానే ఎట్రాక్ట్ చేసింది. తర్వాత 'భలే భలే మగాడివోయ్' సినిమాతో భలే హిట్ కొట్టి, భళారే లక్కీ గాళ్ అనిపించుకుంది. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాతో ఆమె అందం మరింత రెట్టింపయ్యింది. అయితే అందం గురించి ఈ ముద్దుగుమ్మని అడిగితే నేనయితే అస్సలు అందంగా ఉండను. సినీ రంగంలో ఉన్నాక అందం విషయంలో ఇంపార్టెన్స్ ఇవ్వాలి తప్పదు. అయితే అందం అనేది ముఖంలో కనిపించేది కాదు. సినీ పరిశ్రమలో హీరోయిన్స్‌కి అందం ఎంతో విలువైనది. అయితే అందం కన్నా ముఖ్యం నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. అదే ఓ నటికి నిజమైన అందం అని లాజిక్‌గా చెప్పేస్తోంది. వామ్మో అమ్మడికి అందమే కాదండోయ్. చాలా లౌక్యం కూడా ఉందండోయ్. అల్లరి పిల్లే కాదు ఈ అందాల రాక్షసి, చాలా తెలివైనది కూడా. ఇటీవలే 'మిస్టర్' సినిమాతో మన ముందుకొచ్చింది. త్వరలోనే 'రాధ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి ఓ వైపు ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తూనే మరో వైపు అల్ట్రా మోడ్రన్ అమ్మాయిగా కూడా కనిపించనుందట. 'రాధ' పేరుతో అమ్మడి నటన చాలా డిఫరెంట్‌గా ఉంటుందట ఈ సినిమాలో. డైరెక్టర్ చంద్రమోహన్ ఈ సినిమాలో లావణ్య త్రిపాఠిని చాలా అందంగా కూడా చూపించారనీ ప్రోమోస్ ద్వారా తెలుస్తోంది. అందమే కాదు లావణ్య పాత్రకి ప్రాధాన్యత కూడా ఎక్కువేనట.