ఫిలింఫేర్ పురస్కారాల కార్యక్రమంలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచిన బ్యూటీ ఎవరో తెలుసా? ఇంకెవరు 'అందాల రాక్షసి' లావణ్య త్రిపాఠి. తెలుగమ్మాయి కాకపోయినా, పదహారణాల తెలుగుదనం లావణ్యలో ఉట్టిపడుతుంది. అదే ఆమె ప్రత్యేకత. ఒకటీ అరా సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేసినా, ఆమెకి 'క్లీన్' ఇమేజ్ ఉంది. కానీ క్లీవేజ్ సొగసులతో ప్రేక్షకుల మతులు పోగొట్టాలనే లక్ష్యంతో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి గ్లామర్ ఇమేజ్ వైపు దృష్టి సారిస్తున్నట్టుంది. అందుకేనేమో ఫిలింఫేర్ పురస్కారాల సందర్భంగా ఇంకే బ్యూటీ కన్పించనంత హాట్‌గా లావణ్య త్రిపాఠి కన్పించింది. ఫిలింఫేర్ పురస్కారాల వేడుక అనంతరం లావణ్య గురించే చర్చించుకుంటున్నారు సినీ పరిశ్రమలో అందరూ. తొలి సినిమా 'అందాల రాక్షసి'తోనే నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది ఈ బ్యూటీ. సీనియర్ నటుడు నాగార్జునతోనేగాక, యంగ్ హీరోలు నాని, వరుణ్‌తేజ్ వంటివారితోనూ సినిమాలు చేస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది లావణ్య త్రిపాఠి. సీనియర్ల పక్కన సీనియారిటీ ఉన్న నటిగా, యంగ్‌స్టర్స్ పక్కన ఫ్రెష్ లుక్‌తో కన్పించేందుకు లావణ్య తనను తాను ట్రాన్స్‌ఫామ్ చేసుకుంటున్న తీరు మైండ్ బ్లోయింగ్ అని చెప్పక తప్పదు.