సౌత్ డైరెక్టర్స్‌ని అవమానించడం బాలీవుడ్‌లో కామనే. క్రిష్ అంతటి వాడికే తీరని అవమానాలు తప్పలేదు. తాజాగా లారెన్స్ రాఘవ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు 'కాంచన' రీమేక్ విషయంలో. అక్షయ్ కుమార్ హీరోగా 'కాంచన' సినిమాని హిందీలో లారెన్స్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బోలెడంత ఎగ్జైట్‌మెంట్‌తో ఈ సినిమాని పట్టాలెక్కించి, కొంత భాగం షూటింగ్ కూడా చేశాడు లారెన్స్. అయితే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని లారెన్స్‌కి ఇంటిమేట్ చేయకుండా నిర్మాతలు రిలీజ్ చేసేయడం లారెన్స్‌ని బాగా హర్ట్ చేసింది. సహజమే.. సినిమాకి సంబంధించిన విషయాలు అప్డేట్ చేయడంలో దర్శకుడికీ భాగం ఉంది.
అలాంటిది దర్శకుడికి తెలియకుండా ఫస్ట్‌లుక్ ఎలా రిలీజ్ చేస్తారు.? అనేది లారెన్స్ సంధిస్తున్న ప్రశ్న. ఈ కారణంగానే లారెన్స్ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే, బాలీవుడ్‌లో తొలి సినిమా ఇది లారెన్స్‌కి. అలాంటిది తొలి సినిమాకే ఇలా జరగడం బాధాకరం. సినిమా నుండి తప్పుకుంటున్నానన్న తన ప్రకటనకు నిర్మాతలు కనీసపాటి స్పందన ఇవ్వకపోవడం లారెన్స్‌ని మరింత బాధిస్తోంది. ఇష్టం లేకున్నా, సినిమా నుండి తొలగిపోవల్సి వస్తోంది.
ఎంతో ఇష్టపడి అక్షయ్‌కుమార్‌తో ఈ సినిమా చేసేందుకు ఆశక్తి చూపించాను. అయినా అక్షయ్ తప్పేం లేదు. ఆయన చాలా పాజిటివ్ అంటూ, నిర్మాతల మీదే లారెన్స్ ఫైర్ అవుతున్నారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తానంటున్నాడు. కానీ ఎంత చేసినా దానివల్ల లారెన్స్‌కి ఒరిగేదేమీ లేదనేది కొందరి అభిప్రాయం. ఇదిలా ఉంటే, అక్షయ్‌ని మాత్రం ఒక్క మాట కూడా అనడం లేదు లారెన్స్. అయితే, లారెన్స్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం పట్ల అక్షయ్ కూడా ఇంతవరకూ స్పందించకపోవడం కొసమెరుపు.