ఇప్పుడు తమిళనాట రాజకీయాలు ఆసక్తిగా మారటమే గాక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమిళ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. అయితే రోజురోజుకి తమిళనాడులో రాజకీయాల్లోకి వచ్చే నటుల సంఖ్య పెరుగుతున్నది.
ఈ మధ్యకాలంలోనే కమల్ హసన్, రజినీకాంత్ లు తమ ఎంట్రీ ని ప్రకటించగా ఇక రేపు అంటే జనవరి 4వ తేదీన కొరియోగ్రాఫర్-నటుడు-దర్శకుడు అయిన లారెన్స్ కూడా ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నాడట. దీనికి సంబందించిన ప్రకటన రేపు వెలువడనుంది అని తమిళ వార్గాల సమాచారం. స్వతాహ రజినీకాంత్ కి వీరాభిమాని అయిన లారెన్స్ ఇప్పుడు రజిని పెట్టె పార్టీలో చేరుతాడా లేక సొంత కుంపటి పెట్టుకుంటాడా అన్నది తెలియాల్సిఉంది.
ఇదిలావుండగా దక్షిణ భారతదేశంలో సినీ నటులు ఈమధ్యకాలంలో ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో ఉపేంద్ర, తమిళనాడులో కమల్ & రజిని అలాగే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్. ఇది గమనిస్తే, వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో సినీ నటుల హవానే ఉండేలా కనిపిస్తున్నది.
చూద్దాం.. 2019 వరకు ఇంకెంతమంది సినీ తారలు రాజకీయాల్లో మెరవనున్నారో అన్నది.