తన హిందీ చిత్రం ప్రమోషన్లలో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ కి ఆమె గత చిత్రం మహేష్ ‘స్పైడర్’ లొల్లి తప్పడం లేదు.
వివరాల్లోకి వెళితే, ఒక జర్నలిస్ట్ రకుల్ ప్రీత్ ని ఉద్దేశ్యించి ట్వీట్ పెడుతూ- రకుల్ ఒక ఇంటర్వ్యూ లో మహేష్ తో చేసిన ‘స్పైడర్’ చిత్రంలో తన పాత్ర ఇంతవరకు ఏ ఇతర హీరోయిన్ చేయనిది అంటూ చెప్పి, ఆ చిత్రం విడుదల అయి ఫ్లాప్ అయ్యాక మాట మార్చి ఆ సినిమా గురించి తాను ఏమి మాట్లడబోను అని చెప్పిందట.
దీనితో వెంటనే స్పందించిన రకుల్, ఆధారాలు లేకుండా ఇటువంటి ట్వీట్ చేయడం ఒక జర్నలిస్ట్ కి తగదు అంటూ సమాధానమిచ్చింది. దానికి వెంటనే కౌంటర్ గా రకుల్ ప్రీత్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లింక్ పంపించాడు. అందులో జర్నలిస్ట్ చెప్పినట్టుగానే రకుల్ మాట్లాడినట్టు ఉంది.
ఇక దానికి రిప్లై ఇస్తూ రకుల్- ఆ ఇంటర్వ్యూ తీసుకున్నవారు తన మాటలని సరిగా అర్ధం చేసుకోలేదు అని తెలుస్తుంది అంటూ వ్యాఖ్యానించింది. అసలు ఈ సమయంలో స్పైడర్ చిత్రం గురించిన అప్రస్తుతం అయినప్పటికీ ఈ వరుస ట్వీట్స్ తో స్పైడర్ చిత్రం గురించిన చర్చ ముందుకి వచ్చింది.
ఏదేమైనప్పటికీ సినిమా వచ్చి చాలా రోజులైపోతున్నా ‘స్పైడర్’ తాలుకా రిజల్ట్ మాత్రం రకుల్ ని వదలట్లేదు.