‘రత్తాలూ రత్తాలూ..’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా కోసం లక్ష్మీరాయ్‌తో ఆడి పాడిన విషయం విదితమే. మళ్ళీ ‘ఆచార్య’ సినిమా కోసం లక్ష్మీరాయ్‌ని సంప్రదించినట్లు ప్రచారం జరిగిందనీ, అదంతా ఉత్తదేనని తేలిపోయింది. ఇక, మెగాస్టార్ చిరంజీవితో డాన్స్ చేసే ఛాన్స్ వస్తే అస్సలేమాత్రం వదులుకునేది లేదని పదే పదే లక్ష్మీరాయ్ చెబుతూనే వుంది.
మెగాస్టార్‌తో ఛాన్స్ అంటే ఎవరైనా కాదంటారా.? పైగా, ఓ సారి మెగాస్టార్‌తో సూపర్ హిట్ కొట్టేసింది మరి.! ఇక, తాజాగా గాసిప్స్ ప్రకారం చూస్తే, లక్ష్మీరాయ్ ఇంకోసారి మెగాస్టార్‌తో స్టెప్పులేసే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. అయితే, ‘ఆచార్య’ కోసం కాదు, ‘లూసిఫర్’ రీమేక్ లేదా ‘వేదాలం’ రీమేక్ కోసం కావొచ్చన్న ప్రచారం జరుగుతోంది. చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ పనుల్లో తలమునకలై వున్నారు. తొలుత ఈ సినిమా కోసం దర్శకుడు సుజీత్ పేరు తెరపైకొచ్చింది. ఆ తర్వాత వినాయక్ రేసులోకొచ్చాడు.
ఇదిలా వుంటే, ‘వేదాలం’ రీమేక్‌పైనా చిరంజీవి ఉత్సాహంగా వున్నారట. కరోనా టెన్షన్ కొంచెం తగ్గితే చాలు, మెగాస్టార్ చిరంజీవి శరవేగంగా తదుపరి సినిమాల వ్యవహారాలు చక్కబెట్టేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా వుంటే, లక్ష్మీరాయ్‌కి టాలీవుడ్ నుంచి పిలుపు వెళ్ళిందనీ, ఆమె త్వరలో హైద్రాబాద్‌లో ల్యాండ్ కాబోతోందనీ, అదీ మెగాస్టార్ సినిమాకి సంబంధించిన డిస్కషన్స్ కోసమేనని తెలుగు సినీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ గాసిప్స్ లక్ష్మీరాయ్ ఏమంటుందో వేచి చూడాలిక.