చిరు 152వ చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకుడు. లాక్ డౌన్ వల్ల అన్ని సినిమాల్లానే - ఆచార్య షూటింగ్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాని మరలా సెట్స్ పైకి తీసుకు వెళ్లడానికి చిత్రబృందం సమాయాత్తం అవుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ ఎంట్రీతోనే `ఆచార్య` షూటింగ్ మొదలు కాబోతోందని సమాచారం. చరణ్ పక్కన ఓ కథానాయిక కోసం చిత్రబృందం అన్వేషిస్తోంది. ఎట్టకేలకు ఆ అన్వేషణ ఫలించినట్టు సమాచారం. ఈ సినిమాలో చరణ్ సరసన రష్మికని ఫిక్స్ చేసినట్టు సమాచారం.
ఈ విషయంపై చిత్రబృందం రష్మికతో సంప్రదింపులు మొదలెట్టిందని, అవన్నీ ఓ కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. `ఆచార్య`లో రష్మిక ఎంట్రీపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం `పుష్ష`లో నటిస్తోంది రష్మిక. దీంతో పాటు ఓ కన్నడ సినిమా కూడా ఒప్పుకుంది. `ఆచార్య` కోసం రష్మిక 20 రోజుల పాటు కాల్షీట్లు కేటాయించబోతున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ లో చరణ్ రష్మికలపై కొన్ని సీన్లు, ఓ పాటని తెరకెక్కించే అవకాశం ఉంది.