కొంచెం స్వీట్‌గా కొంచెం హాట్‌గా

By iQlikMovies - June 06, 2018 - 17:34 PM IST

మరిన్ని వార్తలు

హాట్‌ బ్యూటీ రాయ్‌ లక్ష్మి గ్లామర్‌ హడావిడి ఇప్పుడు కాస్త తగ్గిందనే చెప్పాలి. అందుకు కారణం ఈ హాట్‌ బ్యూటీ ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్‌లో 'జూలీ 2' సినిమా కోసం అమ్మడు పేరు మార్మోగిపోయింది. 

దానికి కారణం ఆ సినిమాలో రాయ్‌ లక్ష్మి హాట్‌ అప్పీలే. విచ్చల విడి గ్లామర్‌తో రెచ్చిపోయింది రాయ్‌ లక్ష్మి 'జూలీ 2' సినిమాలో. అయితే ఆశించిన స్థాయిలో ఆ సినిమా విజయం అందించకపోయినా కానీ, రాయ్‌ లక్ష్మికి బోలెడంత పాపులారిటీ, పబ్లిసిటీని తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు వివిధ భాషల్లో ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా తమిళంలో ఓ ప్రయోగాత్మక చిత్రంలో నాగిని పాత్రలో నటిస్తోంది రాయ్‌ లక్ష్మి. అది కాక ఓ బైలింగ్వల్‌ మూవీలోనూ రాయ్‌ లక్ష్మి నటిస్తోంది. అంజలి ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాయ్‌ లక్ష్మి పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపిస్తోంది. 

ఇదంతా పక్కన పెడితే, తాజాగా ఈ హాట్‌ బ్యూటీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ ఫోటో చూస్తున్నారుగా, పింక్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో ఎంత బ్రైట్‌గా కైపెక్కిస్తుందో. ఈ హాట్‌ పోజుకి మీరూ ఓ లుక్కేసి, కుదిరితే ఓ లైక్‌ కూడా వేసేస్కోండి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS