బన్నీ ఇంతలా మారిపోయాడేంటీ.?

By iQlikMovies - June 06, 2018 - 17:17 PM IST

మరిన్ని వార్తలు

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ విషయంలో కొంత ఇబ్బందికరంగా బిహేవ్‌ చేసేవాడు. అలా మెల్లమెల్లగా మెగా కాంపౌండ్‌ హీరో అయినప్పటికీ, స్టైలిష్‌ స్టార్‌ అభిమానులు మెగా అభిమానులు సెపరేట్‌ అయిపోయారు. ముఖ్యంగా పవన్‌ అభిమానులు, బన్నీ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా విబేధాలు పెరిగిపోయాయంటే అందుకు కారణం అల్లు అర్జున్‌. 

'చెప్పను బ్రదర్‌' అనే చిన్న మాటతో పెద్ద వివాదానికి ఆధ్యం పోశాడు బన్నీ. అలాంటిది ఇప్పుడు బన్నీ చాలా మారిపోయాడు. పవన్‌పై అస్సలు ఈగ వాలనివ్వడంలేదు. కాస్టింగ్‌ కౌచ్‌ వివాదంలో పవన్‌ నిరసనకి సపోర్ట్‌గా నిలిచాడు. బన్నీ నటించిన 'నా పేరు సూర్య' సక్సెస్‌ మీట్‌కి పవన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇదిలా ఉంటే, లేటెస్టుగా అల్లు అర్జున్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్‌ గురించి ఓ పోస్ట్‌ పెట్టాడు. పవన్‌ కళ్యాణ్‌ ఫోటో షేర్‌ చేశాడు. ఆ ఫోటో మీద 'లివ్‌ బై యువర్‌ ట్రూ మేడ్‌నెస్‌ ద వరల్డ్‌ విల్‌ అడ్జస్ట్‌..' అనే మాటలున్నాయి. ఇది జనసేన పార్టీ తరపున పవన్‌ జనంలోకి వెళ్లినప్పటి ఫోటో. 

ఈ పోస్ట్‌ వెనుక అల్లుఅర్జున్‌ ఉద్దేశ్యం, రాజకీయంగా పవన్‌కి అల్లు అర్జున్‌ పూర్తి మద్దతు ప్రకటించినట్లే. మేం చిరంజీవి వెంటే ఉంటాం అని నిన్న మొన్నటి దాకా చెప్పిన మెగా కాంపౌండ్‌ ఇప్పుడు పవన్‌కి జై కొడుతున్నారు. 

ఇదంతా చూస్తుంటే, చిరంజీవి శకం జనసేనకు తమవంతు సహకారం అందించనున్నట్లు తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS