ప్రజంట్ సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకొంది. ఒక మూవీ సెట్స్ మీద ఉండగానే, సెకండ్ పార్ట్ అనౌన్స్ చేస్తున్నారు. ఇంకొక కొత్త కథ వెతికే బదులు ఉన్నదానిని ఇంకొంచెం పొడిగిస్తే బెటర్ అని ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అలా వచ్చినవే బాహుబలి, KGF . సలార్, దేవర కూడా అదే బాటలో సెకండ్ పార్ట్ తో వస్తున్నాయి. ఈ క్రమంలోనే పాత సూపర్ హిట్ సినిమాలు కూడా ఇప్పుడు సీక్వెల్స్ కి నోచుకుంటున్నాయి.
దాదాపు 15 సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా మూవీకి ఇప్పుడు సీక్వెల్ రానున్నది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా డెబ్యూ మూవీ లీడర్ సూపర్ హిట్ టాక్ తో, ఆడియన్స్ ని అలరించింది. యువ సీఎం గా రానా నటన అందర్నీ ఆకట్టుకుంది. పొలిటికల్ కుళ్ళుని ప్రశ్నిస్తూనే, సమాజంలో పాతుకుపోయిన మంత్రుల అవినీతిని చూపించిన తీరు, యువత రాజకీయాల్లోకి వచ్చి, దేశాన్ని బాగు చేయొచ్చు అన్న సందేశాన్ని ఇస్తూ శభాష్ అనిపించుకుంది లీడర్.
లీడర్ తరవాత, రానా లైఫ్ లో చెప్పుకోదగిన హిట్ అంటే బాహుబలి మాత్రమే, లీడర్ లాంటి సోలో హిట్ మళ్ళీ రానా సొంతం కావాలని ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి శేఖర్ కమ్ముల గుడ్ న్యూస్ చెప్పారు. లీడర్ కి సీక్వెల్ తీసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏషియన్ బ్యానర్లో శేఖర్ కమ్ముల నాగ్- ధనుష్ లతో సినిమా చేస్తున్నారు. ఇదే ఏషియన్ బ్యానర్ కు మూడో కమిట్మెంట్ కూడా ఇచ్చారని, అధికారకంగా ప్రకటించారు. దీనితో లీడర్ 2 మూవీ ప్రచారం జోరందుకుంది. శేఖర్ కమ్ముల ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసారని, రాష్ట్ర విభజన తరవాత తలెత్తిన పరిస్థితుల గూర్చి లీడర్ 2 లో చూపించనున్నట్టు తెలుస్తుంది.
ఈ మూవీ కోసం రానా తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోల పేర్లను శేఖర్ కమ్ముల పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరన్న విషయం ఇంకా తెలియ లేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. నాగార్జున ధనుష్ సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం.