మళ్ళీ ఫూల్స్ ని చేసిన పూనమ్

మరిన్ని వార్తలు

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన  పూనమ్ పాండే గత రెండు రోజులుగా వార్తల్లో నిలిచింది. శుక్రవారం పూనమ్ ఇనిస్టా పేజీలో సర్వేకల్ కాన్సర్ వలన చనిపోయినట్లు న్యూస్ వచ్చింది. నిజమా కాదా అన్న సందిగ్ధం లో ఉండగా పూనమ్ పాండే ఫిబ్రవరి 2 ఉదయం సర్వైకల్ క్యాన్సర్‌తో మృతి చెందినట్లు ఆమె మేనేజర్ పరుల్ చావ్లా ఏఎన్ఐ న్యూస్ ఎజెన్సీకి  తెలిపాడు. దాని తర్వాత కాసేపటికే పూనమ్ పాండే అధికారిక ఇన్ స్టా గ్రామ్ అకౌంట్‌లో ఆమె చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆమె యూపీలో తన నివాసం లో మరణించినట్లు, అంత్యక్రియలు అక్కడే నిర్వహించనున్నట్లు అనౌన్స్ చేశారు. మేనేజర్ కన్ఫామ్ చేయటం తో అంతా షాక్ అయ్యారు. చిన్న వయసులో చనిపోయింది అని బాధపడ్డారు. పలువురు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. సోషల్ మీడియాలో రిప్ పూనమ్ పాండే పేరుతో ట్రెండింగ్ కూడా అయింది. మరి కొందరు ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే అని తోసి పుచ్చారు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూనమ్ త్వరలోనే తానొక బిగ్ సరప్రయిజ్ ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది. అందుకే కొందరు నమ్మలేదు.

 
ఈ క్రమంలోనే తాను బతికే ఉన్నానంటూ ఇన్‌స్టాలో వీడియో షేర్‌ చేసింది పూనమ్‌ పాండే. సర్వైకల్‌ క్యాన్సర్‌ నానాటికీ ప్రమాదకరంగా మారుతుందని.. దానిపై అవగాహన కల్పించేందుకే చనిపోయినట్లు పోస్ట్ పెట్టించానని వెల్లడించారు. "నేను మీ అందరితో ఒకటి చెప్పేందుకు ఇలా వీడియో చేస్తున్నాను. నేను బతికే ఉన్నాను. నేను సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించలేదు. కానీ, ఎన్నో వేల మంది అమ్మాయిలు ఈ క్యాన్సర్‌తో చనిపోయారు. సర్వైకల్ క్యాన్సర్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక అంతమంది అమ్మాయిలు చనిపోవడం చాలా బాధాకరం" అని పూనమ్ పాండే తెలిపింది‘‘ ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాదు. దీనిని నివారించడం సాధ్యమే. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ లేదా ముందస్తుగా గుర్తించడం అవసరం. ఈ వ్యాధితో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ఉండే మార్గాలు ఉన్నాయి. అందరికీ అవగాహన కల్పిద్దాం’’ అని ఆమె రాసుకొచ్చారు.


మరొక వీడియోలో అలా తను చేసినందుకు క్షమాపణలు చెప్పింది. "నేను ఎవరినైనా కంటతడి పెట్టిస్తే.. నా వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే వారందరు నన్ను క్షమించండి. ప్రతి ఒక్కరికీ ఒక షాక్ లాంటి వార్తతో సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సినంత అవగాహన కల్పించడమే నా ముఖ్య ఉద్దేశం. అవును, నా చావు గురించి అబద్ధం ఆడాను. ఇది చాలా పెద్ద విషయం అని నాకు తెలుసు. అందుకే కదా మనమందరం ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం. " అని పూనమ్ తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు మండిపడ్డారు. ఇలాంటి ప్రచారం సరికాదంటూ విమర్శిస్తున్నారు. మొత్తానికి మరో సారి అందరినీ ఫూల్స్ ని చేసింది పూనమ్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS