ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న 'అరవింద సమేత' చిత్రానికి లీకుల బెడద వెంటాడుతోంది. మొన్నీ మధ్యనే కొన్ని ఫోటోలు, వీడియోలు లీకయ్యాయంటూ చిత్ర యూనిట్‌ని పరుగులు పెట్టించింది సోషల్ మీడియా. ఆ ఎఫెక్ట్‌తో చిత్ర యూనిట్ అంతా ఓ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. ఎలక్ట్రానిక్ వస్తువులేమీ సెట్‌లో వాడకూడదనీ, అసలు తీసుకురాకూడదనీ గట్టిగా డెసిషన్ తీసుకుంది.
అయితే తాజాగా మరోసారి లీకుల కలకలం 'అరవింద సమేత'ను వెంటాడింది. ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. అయితే అంతకు ముందే ఇదిగో ఎన్టీఆర్ సినిమా టీజర్ అంటూ నెట్టింట్లో కొన్ని వీడియోలు, ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. దాంతో చిత్ర యూనిట్‌లో మరోసారి కలవరం మొదలైంది. కారులో ఎన్టీఆర్, నాగబాబు ఉన్న వీడియోలు అవి.
ఎన్టీఆర్ హావభావాలతో కూడిన పిక్స్ కొన్ని నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే నిజంగా ఇదే 'అరవింద సమేత' టీజరా? అని అభిమానులు అవాక్కవుతున్నారు. ఇదిలా ఉంటే, గతంలో త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'అత్తారింటికి దారేది' చిత్రం కూడా విడుదలకు ముందే చాలా వరకూ వీడియో నెట్‌లో లీకైపోయింది. అయినా కానీ విడుదలయ్యాక ఆ లీకేజీ సినిమాపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు ప్రేక్షకులు.
అలా ఆ సెంటిమెంట్ ఇప్పుడు 'అరవింద సమేత..'కు కూడా వర్తిస్తే, పండగే కదా.!