పవన్ కల్యాణ్ చిక్కుల్లో పడ్డారు. ఓ టీవీ ఛానల్‌పై చిరుబురులాడుతూ.. పవన్ ఇటీవల కొన్ని ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. తన తల్లిని ఓ నటి తిడితే... ఆ తిట్టుని మ్యూట్ చేయకుండా యధాతధంగా వాడారన్నది పవన్ కల్యాణ్ అభియోగం. అయితే జర్నలిస్టు సంఘాలు మాత్రం పవన్ ఆ వీడియోని మ్యూట్ చేసి, వాయిస్ మార్ఫింగ్ చేశారని, పోలీసుల్ని, సమాజాన్ని తప్పుదోవ పట్టించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం విచారణ జరిపిన పోలీసులు పవన్ నేరం చేశారనడానికి ప్రాధమిక ఆధారాలు సేకరించార్ట. దాంతో ఐపీసీ 469, 504, 506 సెక్షన్ల ప్రకారం పవన్‌పై కేసులు నమోదు చేసినట్టు తులుస్తోంది. ఓ విధంగా పవన్‌పై ఇది సీరియెస్ ఎలిగేషనే. ఈ నేరం కనుక రుజువైతే కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఏడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందట.
దాంతో పాటు భారీ జరిమానా కూడా విధిస్తార్ట. మరి... పవన్ ఈ కేసుల్ని ఎలా ఎదుర్కుంటారో చూడాలి.