Puri, Liger: పోస్ట‌ర్‌తోనే మెంట‌లెక్కించేసిన పూరి

మరిన్ని వార్తలు

పూరి మాట‌లు, చేత‌లు బోల్డ్ గా ఉంటాయి. త‌న సినిమాలోని హీరో ఇంకా బోల్డ్ గా ఉంటాడు. పూరి సినిమాల్లో నచ్చే విష‌యం ఇదే. ఇప్పుడు లైగ‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని మ‌రింత బోల్డ్ గా చూపించేశాడు పూరి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో లైగ‌ర్ సినిమా జ‌రుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఓ పోస్ట‌ర్ ఇప్పుడు నెట్టింట హల్ చ‌ల్ చేస్తోంది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ దాదాపుగా న‌గ్నంగా క‌నిపిస్తున్నాడు. చేతిలో.. ఓ ఫ్ల‌వ‌ర్ బొకే తో త‌న మ‌ర్మాంగాన్ని అడ్డు పెట్టుకోవ‌డం త‌ప్ప‌... శ‌రీరంపై ఎలాంటి అచ్చాద‌న లేదు. ఈ పోస్ట‌ర్ టాలీవుడ్ లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. విజ‌య్‌ని పూరి ఇలా చూపిస్తాడ‌ని అస్స‌లు ఎవ‌రూ ఊహించ‌లేదు. ఎవ‌రూ అనుకోని విధంగా పోస్ట‌ర్ డిజైన్ చేయ‌డంతో.. అంతా షాక్ కి గుర‌వుతున్నారు. పోస్ట‌రే ఇలా ఉంటే, సినిమాలో ఇంకెలా ఉంటుందో? అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

 

బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. సినిమాలో స‌న్నివేశ ప‌రంగా విజ‌య్ న‌గ్నంగా క‌నిపిస్తున్నాడా, లేదంటే... కేవ‌లం ఇది పోస్ట‌ర్ కోస‌మేనా? అనేది చూడాలి. మొత్తానికి ఒక్క పోస్ట‌ర్ తోనే... పూరి మెంట‌లెక్కించేశాడు. ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా పెంచేశాడు. ఇక నుంచి వారానికో, ప‌ది రోజుల‌కో ఓ పోస్ట‌ర్ వ‌దిలి... ఇలా సినిమాపై క్రేజ్ తీసుకురావాల‌ని పూరి భావిస్తున్నాడ‌ట‌.

 

ఫ‌స్ట్ సైట్ లోనే.. ఇలాంటిది వ‌దిలాడంటే, ఫ్యూచ‌ర్‌లో ఇంకెన్ని రాబోతున్నాయో..?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS