రమ్య రఘుపతి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని నటుడు నరేశ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ''రమ్య రఘుపతితో విడిపోయి ఎనిమిదేళ్ళు అవుతుంది.
హిందూపురంతో పాటు పలుచోట్ల కొన్ని ఆర్ధిక మోసాలకు పాల్పడుతూ ఇబ్బంది పెట్టి ఎనిమిదేళ్ళ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఏడాది పాటు ఒక ఆర్గనైజ్ క్రైమ్ చేసినట్లు పలు చోట్ల ఫైనాన్స్ తీసుకుంటూ వాళ్ళని మోసం చేస్తూ పట్టుబడి పోలీసు స్టేషన్ లో సెటిల్ చేసుకొని మళ్ళీ బెంగళూర్ వెళ్లి అక్కడ బ్లాక్ మెయిల్ ఛానల్ తో కలసి నా గురించి వదంతులు సృస్టించింది, ఇందలో వాస్తవం లేదు. 50 లక్షల కోసం ఇంట్లో వాళ్ళని పీడించింది. రమ్య రఘుపతికి విడాకుల నోటీసు పంపి నెల అవుతుంది. విడాకుల నోటీసు పంపిన తర్వాత నాకు పెళ్లి కాబోతుందని రూమర్స్ క్రియేట్ చేసింది.
కన్నడ మీడియాలో ఆ అంశంపై పూర్తి వివరణ ఇచ్చా. రమ్య రఘుపతి చేసిన మోసాలు, బ్లాక్ మెయిల్ అవమానకరం. పవిత్ర లోకేష్ ని లింక్ చేసి రూమర్స్ క్రియేట్ చేయడం చాలా తప్పు. పవిత్ర లోకేష్ నాకు మధ్య ఎలాంటి దాపరికం లేదు. మా స్నేహం మాది'' అని చెప్పుకొచ్చారు.