'లైగర్' సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. లైగర్ కష్టాలు ఇంకా ఆ టీంని వెంటాడుతున్నాయి. తాజాగా ఈ సినిమా విషయంలో ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. కొన్నాళ్లుగా ‘లైగర్’ సినిమా లావాదేవీల విషయంలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఈడీ విచారణకు ఆ చిత్ర దర్శకుడు పూరీజగన్నాథ్, ఛార్మి హాజరవగా.. ఇప్పుడు విజయ్‌ను విచారిస్తున్నారు.
లైగర్ సినిమాకు సంబంధించిన వ్యవహారంలో దుబాయికి డబ్బులు పంపించి అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు గతంలో ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో మరో ప్రముఖుడి ప్రమేయం కూడా ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే ‘లైగర్’ సినిమా నిర్మాణంలో భాగస్వాములైన వారిని అధికారులు విచారిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా విడుదలైన లైగర్ తీవ్రంగా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.