బాక్సాఫీసు దగ్గర `కాంతార` డ్రీమ్ రన్ కొనసాగుతూనే ఉంది. తొలి రోజు నుంచే... వసూళ్ల వర్షం కురిపించుకొంటూ.. రోజు రోజుకీ తన దూకుడు పెంచుకొంటూ పోయిన కాంతార.. రికార్డులన్నీ బద్దలు కొడుతూ వచ్చింది. ఇప్పుడు కేజీఎఫ్ 2 రికార్డు కూడా కాంతార ధాటికి హుష్ కాకి అయ్యింది. కన్నడ సీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కేజీఎఫ్ 2 పేరు మీద ఉన్న రికార్డుని కాంతార బద్దలు కొట్టింది. కేజీఎఫ్ టోటల్ రన్ లో రూ.172 కోట్లు సాధించింది. దాన్ని... 60 రోజుల్లోనే కాంతార అధిగమించింది. ఇప్పుడు కన్నడ సీమలో కాంతారనే టాప్ గ్రాసర్.
కేజీఎఫ్ 2 కీ, కాంతార కీ మధ్య చాలా తేడాలున్నాయి. కాంతారాతో పోలిస్తే కేజీఎఫ్‌చ 2లో బోలెడంత మంది స్టార్లున్నారు. పైగా... కేజీఎఫ్ బడ్జెట్ వందల కోట్లలో ఉంది. కేవలం రూ.18 కోట్లతో రూపొందిన కాంతారలో స్టార్లు లేవు. కేవలం కథే బలంగా కాంతారని తీశారు. కాంతార ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసింది. లాభాల పరంగా చూసినా.. కాంతారది తిరుగులేని రికార్డ్ గా చెప్పొచ్చు.