మరో రెండు రోజుల్లో `లైగర్` రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులే కాదు.. యావత్ భారత్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సౌత్ లో కంటే నార్త్ లో ఈ సినిమాపై క్రేజ్ ఎక్కువగా ఉంది. విజయ్ దేవరకొండ ఎక్కడకు వెళ్లినా... అభిమానులు నీరాజనం పలుకుతున్నారు. ఈ ఊపు చూస్తుంటే - నార్త్ లో ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయం అనిపిస్తోంది. ఇటీవలే... లైగర్ సెన్సార్ జరుపుకుంది. దాంతో సెన్సార్ టాక్ ఎలా ఉంది? సినిమా ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
2 గంటల 15 నిమిషాల సినిమా ఇది. రన్ టైమ్ ప్రకారం చూస్తే పర్‌ఫెక్ట్. తొలి సగం 70 నిమిషాలు, రెండో సగం 65 నిమిషాల్లో పూర్తి కానుంది. తొలి సగంలో పాత్రల పరిచయం, కాన్ల్ఫిక్ట్ తో సరిపెట్టిన దర్శకుడు. రెండో సగంలో అసలు కథ చెప్పాడట. ఈ సినిమాలో 6 పాటలూ, 7 ఫైట్లూ ఉన్నాయని సమాచారం. తొలి సగం... ఏవరేజ్ గా సాగిందని, సెకండాఫ్ అదిరిపోయిందన్నది సెన్సార్ టాక్.
చివరికి 20 నిమిషాలే ఈ సినిమాకి హైలెట్ అని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ 20 నిమిషాల్లోనే ఈ సినిమా ఏవరేజ్ నుంచి హిట్ స్థాయికి వెళ్లిపోయిందని, పూరి మార్క్ పంచ్ డైలాగులు ఈ సినిమాలో తెగ పడ్డాయని, లైగర్ గా విజయ్ క్యారెక్టర్ నెక్ట్స్ లెవల్ అని సెన్సార్ రిపోర్ట్! అదే జరిగితే... తెలుగులో మరో పాన్ ఇండియా హిట్ పడిపోయినట్టే.