నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్ యాక్టివ్ గా వుంటారు. అటు సినిమా ఇటు రాజకీయం రెండు వైపులా ఆయన ట్వీట్లు వెళ్తుంటాయి. ఇపుడు ఆయన జీవితా రాజశేఖర్ దంపతులని టార్గెట్ చేశారు ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న జీవిత, రాజశేఖర్ ఇటీవల బండి సంజయ్ చేపట్టిన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ... హైదరాబాద్‌లోని పబ్‌ల్లో మంత్రి కేటీఆర్‌కు వాటాలు ఉన్నాయని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టుకుంటోందని, తెలంగాణ రాక ముందుకు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత ఉన్నాయో చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. జీవితా రాజశేఖర్ వ్యాఖ్యలకు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. ‘లక్ష్మీపార్వతి పెట్టిన అన్న ఎన్టీఆర్ పార్టీ మర్చిపోయినట్టున్నారు. మన రాష్ట్రంలో పార్టీ జెండాలు ఎన్ని ఉన్నాయో అన్ని జెండాలు మెడలో వేసుకున్నారు ఆదర్శ దంపతులు. ఇంకా సీపీఎం, సీపీఐ, ఎంఐఎం మాత్రమే ఉన్నాయి. వాటిలో కూడా చేరి బ్యాలెన్స్ చేయండి అక్కా’ అంటూ సెటైర్ వేశాడు. అంతేకాకుండా జీవిత, రాజశేఖర్ దంపతులు వివిధ పార్టీల్లో చేరిన సందర్భాల్లోని ఫొటోలను సైతం షేర్ చేశాడు. ఇప్పుడీ పోస్ట్ వైరల్ గా మారింది. మరి దీనిపై జీవిత ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి.