విజయ్ దేవర కొండ- పూరీ జగన్నాథ్ లైగర్ ట్రైలర్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ ఒక పెద్ద ప్రామిస్ చేశారు. దేశాన్ని షేక్ చేస్తానని చెప్పాడు విజయ్.
''అభిమానుల మెంటల్ మాస్ చూస్తుంటే పిచ్చేక్కిపోతుంది. అసలు ఏం అర్ధమైతలేదు. రెండేళ్ళు అవుతుంది సినిమా విడుదలై. ముందు రిలీజైన సినిమా పెద్ద చెప్పుకునే సినిమా కూడా కాదు. అయినా లైగర్ ట్రైలర్ కి అభిమానులు రచ్చ చూస్తుంటే మెంటలెక్కిపోతుంది. మీ ప్రేమని మాటల్లో చెప్పాలంటే ఐ.. ఐ.. ల వ్ యూ. ఈ సినిమా అభిమానులకు అంకితం చేస్తున్నా. ఈ సినిమాలో బాడీ చేయడం, ఫైట్స్ చేయడం ఒక ఎత్తు అయితే డ్యాన్స్ మరో లెవెల్. ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలని డ్యాన్సులు చేశా. ఆగస్ట్ 25న ప్రతి థియేటర్ లో పండగ జరగాలి. ప్రేక్షకులతో నిండిపోవాలి. ప్రామిస్ చేస్తున్నా. ఆగస్ట్ 25 ఇండియా షేక్ అయితది'' అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు విజయ్.
ఇక పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. లైగర్ గురించి కాదు విజయ్ గురించి చెబుతున్నా విజయ్ దేశంలో నెక్స్ట్ బిగ్ థింగ్, నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా.. రాసిపెట్టుకోండి. సరిగ్గా ఇంకా నెల రోజులు వుంది సినిమా. ఇలాగే వుండండి. ఇలాగే వుంటది. కుమ్మేద్దాం'' అని చెప్పుకొచ్చారు . మొత్తానికి లైగర్ టీం పాన్ ఇండియాని షేక్ చేయాలనీ దృడ నిశ్చయంతో వుంది.