సమ్మోహనం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే

By iQlikMovies - June 23, 2018 - 17:13 PM IST

మరిన్ని వార్తలు

సుధీర్ బాబు-అదితి రావు హైదరి తాజా చిత్రం సమ్మోహనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఈ సినిమా తొలిరోజు నుండే మంచి పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతున్నది.

ఇక ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా మొదటివారం కలెక్షన్స్ ని ఒకసారి చూస్తే ఈ చిరం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ 6 కోట్ల (షేర్) అలాగే రూ 11 కోట్ల (గ్రాస్)వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి.

అయితే ఈ వారం వచ్చిన జంబ లకిడి పంబ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాకి ప్రేక్షకులు మొగ్గుచూపే అవకాశం ఉంది. దీనితో ఈ సినిమా కలెక్షన్స్ ఈ వారం కూడా బాగానే వస్తాయి అని ఆశిస్తున్నారు. మొత్తానికి సుధీర్ బాబు కి మంచి హిట్ వచ్చింది, అదితికి తెలుగులో మంచి ఓపెనింగ్ వచ్చింది. ఇదే సమయంలో మోహనకృష్ణ ఇంద్రగంటికి వరుసగా రెండో సక్సెస్ వచ్చింది.

 

ఇవ్వనిపక్కన పెడితే ప్రేక్షకులకి ఒక మంచి చిత్రం లభించింది.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS