టాలీవుడ్ లోని హీరోలు, దర్శకులు.. అందరూ మైత్రీ దగ్గర అడ్వాన్సు తీసుకున్నవాళ్లే. వారిలో ఎవరెవరితో సినిమాలు తీస్తారో తెలీదు గానీ, కనీసం పది మంది దర్శకులు, పది మంది హీరోలూ `మైత్రీ`తో మైత్రి కుదుర్చుకున్నారు. ఇప్పుడు తమిళ దర్శకుడు లొకేష్ కనకరాజ్ కీ అడ్వాన్స్ అందింది.
ఖైదీతో అదరగొట్టిన దర్శకుడు లోకేష్. కార్తి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. విమర్శకులు ఈ సినిమాని నెత్తిన పెట్టుకున్నారు. లోకేష్ ఈ కథని నడిపిన విధానం ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు లోకేష్ పెద్ద దర్శకుడైపోయాడు. విజయ్ తో `మాస్టర్` తీశాడు. సినిమా పూర్తయింది. మరోవైపు `ఖైదీ 2` పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మైత్రీ మూవీస్ లో సినిమా చేయడానికి సంతకం చేశాడు. హీరో ఎవరు? కథేమిటి? అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. కేవలం ఒప్పందాలు కుదిరాయి అంతే. ఖైదీ 2 తరవాతే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది.