మైత్రీ మూవీ మేకర్స్ సినీ నిర్మాణంలో రంగంలో ఉప్పెనలా దూసుకొచ్చింది. మంచి సక్సెస్ రేటుతో తన కంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. దర్శకుడు రాజమౌళి మైత్రీ మూవీ మేకర్స్ ని 'గోల్డ్ డిగ్గర్స్' అని అభివర్ణించారు. హిట్ ఎక్కడుంటే అక్కడ వెతికిపట్టుకుంటారని ఆయన అభిప్రాయం. అయితే మైత్రీ మూవీ మేకర్స్ కి ఇప్పుడు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మహేష్ బాబు సర్కారు వారి పాట, నాని అంటే సుందరానికీ, హ్యాపీ బర్త్ డే చిత్రాలు వరుసగా దెబ్బకొట్టాయి.
సర్కారు వారి పాట భారీ అంచనాలతో విడుదలైయింది. డివైడ్ టాక్ తో మొదలై బిలో యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. అసలు పాయింట్ సెకండ్ హాఫ్ పై సరైన కసరత్తు జరగలేదనే అభిప్రాయం వ్యక్తమైయింది. అంటే సుందరానికీ చాలా వరకూ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. లాగ్ వున్న మాట వాస్తమే కానీ చాలా కొత్తగా ఫ్రెష్ గా ప్రజంట్ చేశారు. కానీ ఈ సినిమాకి ఆడియన్స్ కనెక్ట్ కాలేదు. పాండమిక్ తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారిందని చెప్పడానికి ఈ సినిమా ఉదాహరణగా నిలిచింది. థియేటర్ కి రావాలంటే ప్రేక్షకుడికి ఇంకేదో కావాలి. ఇండస్ట్రీ ఇది చాలా డీప్ గా అలోచించాల్సిన విషయం.
హ్యాపీ బర్త్ డే అని మరో సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. అసలు ఈ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సినిమా కూడా ఎటూ కాకుండా వుంది. మైత్రీ నుండి రావాల్సిన కంటెంట్ కాదని అభిప్రాయ వ్యక్తమైయింది. ఇప్పుడు మైత్రీ చిరంజీవి, బాలకృష్ణ లాంటి సినియర్ హీరోలతో సినిమాలు నిర్మిస్తుంది. సినియర్ హీరోలు మైత్రీ మూవీ మేకర్స్ ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తారేమో చూడాలి.