సినీ స్టార్స్ అంతా ఆల్ మోస్ట్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నవాళ్లే. ఈ జనరేషన్‌కి చెందిన యంగ్ హీరోలు చరణ్, అల్లు అర్జున్, నాని, ఎన్టీఆర్ తదితర హీరోలందరూ మొదట లవ్‌లో ఉండి, తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలదాకా చేరినవారే. కానీ వీరి పెళ్లి సంగతులు మాత్రమే మనందరికీ తెలుసు. ప్రేమ వ్యవహారంలోని లోతైన సంగతులు మాత్రం మన దాకా చేరనివ్వలేదు ఈ యంగ్ హీరోలు. అయితే ఈ ఏడాది లవ్ స్టోరీల్లో సెన్సేషన్ స్టోరీలన్పించుకున్నవి మాత్రం అక్కినేని లవ్ స్టోరీసే అని చెప్పవచ్చు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇద్దరు యంగ్ హీరోలు నాగ చైతన్య, అఖిల్ లవ్ స్టోరీలు మాత్రం సూపర్ సెన్సేషన్ అయ్యాయి. అఖిల్, హైద్రాబాదీ ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్‌ను లవ్ చేయగా, ఆయన అన్నయ్య నాగచైతన్య మాత్రం నెంబర్ వన్ హీరోయిన్ సమంతను లవ్‌లో పడేశాడు. అఖిల్, శ్రియా భూపాల్‌కి ఇటీవలే ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. ఇక పెళ్లి పీటలెక్కడమే తరువాయి. బహుశా వచ్చే ఏడాది ఆ ముచ్చట ఉండవచ్చు. సినిమా పరంగా అఖిల్‌కు ఈ ఏడాది తొలి సినిమా నిరాశ పరిచినా, పర్సనల్ లైఫ్ పరంగా లవ్ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యింది.
ఇక నాగచైతన్య, సమంతల ప్రేమ వ్యవహారం మాత్రం ఇంకా ఎంగేజ్‌మెంట్ దాకా చేరలేదు. బహుశా కొత్త సంవత్సరంలో ఈ శుభవార్త ఉండవచ్చునంటున్నారు. జనవరి 29న ఈ జంట నిశ్చితార్దం జరగనుందని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ లోగా ఈ ఇద్దరూ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఏ కాం త వే ళ.. అంటూ డ్యూయెట్స్ వేసుకోవడం మాత్రం మనకి తెలీదు కానీ, యూ ట్యూబ్ సాక్షిగా ఈ జంట చేస్తున్న హడావిడి అంతా మాత్రం అబ్బో ! అంతా ఇంతా కాదు. దాంతో యూ ట్యూబ్ వీక్షకులకి సమంత, చైతూ నుంచి ఏ రకమైన హాట్ న్యూస్ విందామా అంటూ క్యూరియాసిటీ.. తాజా తాజా వీడియోలను, ఫోటోలను ఆప్ లోడ్ చేస్తూ సమంత ఫ్యాన్స్‌ని బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ ఏడాది సమంత, చైతూల మ్యారేజ్ న్యూసే హాట్ హాట్ న్యూస్ అయ్యింది. ఓ పక్క సినిమా న్యూస్ మరో పక్క మ్యారేజ్ న్యూస్ ఇలా.. రోజుకో రకం న్యూస్‌తో ప్రతీ రోజూ ఈ జంట వార్తల్లో సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ అయ్యారు. ఈ ఏడాది సమంత 'అ,ఆ..' సినిమాతో బిగ్గెస్ట్ హిట్‌ని అందుకుంది. 'బ్రహ్మూెత్సవం' నిరాశపరిచినా, 'జనతా గ్యారేజ్' సినిమా రికార్డు స్థాయిలో విజయాన్ని అందించింది. ఇక చైతూ 'ప్రేమమ్', 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలతో సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఈ జంట చేయబోయే సినిమాల సంగతి ఎలా ఉన్నా, కానీ లవ్ లో మాత్రం ఫుల్ జోష్‌లో ఉన్నారు. కలర్‌ఫుల్‌గా కొన్ని బహిరంగ వేడుకలకు హాజరవుతున్నారు. పర్సనల్‌గా లెక్కలేనంత ఎంజాయ్ చేస్తున్నారు.
మొత్తానికి ఈ ఏడాది వీరి లవ్ స్టోరీస్ సెన్సేషన్ అయితే వచ్చే ఏడాది వీరిది సూపర్ సెన్సేషనల్ వెడ్డింగ్స్ కానున్నాయన్న మాట. వచ్చే ఏడాది అక్కినేని వారింట పెళ్లి సందడే సందడి.