తొలి మూడు రోజుల్లో విజృంభించిన లవ్ స్టోరీ హవా.. ఆ తరవాత కాస్త తగ్గింది. సోమవారం స్వతహాగా వసూళ్ల జోరు మందగిస్తుంది. అయితే దానికి గులాబ్ తుఫాను తోడైంది. సోమ, మంగళవారాలు వర్షాల వల్ల.. వసూళ్లకు గండి పడింది. దాంతో 4, 5 రోజుల్లో... లవ్ స్టోరీ వసూళ్లు భారీగా పడిపోయాయి. 4వ రోజులు ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్లు సాధించిన ఈ చిత్రం 5వ రోజు 1.2 కోట్లకు పరిమితమైంది. అయితే నైజాంలో లవ్ స్టోరీ ఏకంగా 10 కోట్ల మైలు రాయిని చేరుకోవడం విశేషం.
5 రోజుల్లో ఎంత?
నైజాం: 10.8 కోట్లు
సీడెడ్: 3.32 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.35 కోట్లు
ఈస్ట్: 1.29 కోట్లు
వెస్ట్: 1.09 కోట్లు
గుంటూరు: 1.29 కోట్లు
కృష్ణ: 1.08 కోట్లు
నెల్లూరు: 68 లక్షలు
కర్నాటక, రెస్టాఫ్ ఇండియా: 1.18 కోట్లు
ఓవర్సీస్: 4.3 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా: 26.66 కోట్ల షేర్