టాలీవుడ్ కి అతి ముఖ్యమైన సీజన్ దసరా. సంక్రాంతి, వేసవి తరవాత దసరాపైనే నిర్మాతలు గురి పెడుతుంటారు. ఈసారీ.... దసరా సీజన్‌లో సినిమాలు వరుస కట్టబోతున్నాయి. బడా హీరోల సినిమాలేం ఈసారి బరిలో లేవు గానీ, మీడియం రేంజు సినిమాలకు మాత్రం కొదవ లేకుండా పోయింది. పెద్ద సినిమాలు తప్పుకోవడం చిన్న సినిమాలకు ప్లస్ అయ్యింది. వీలైనన్ని ఎక్కువ సినిమాలు ఈ దసరా సీజన్‌లో చూసే అవకాశం దక్కబోతోంది.
అక్టోబరు 1న `రిపబ్లిక్`తో ఈ సీజన్ మొదలు కాబోతోంది. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ కథానాయిక. దేవాకట్టా దర్శకత్వం వహించారు. అక్టోబరు 8న కొండపొలెం విడుదల అవుతోంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ కథానాయకుడు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. అన్నదమ్ములిద్దరూ ఒక వారం వ్యవధిలో బరిలోకి దిగడం విశేషం. అక్టోబరు 14న మహా సముద్రం రానుంది. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అజయ్ భూపతి దర్శకుడు. సిద్దార్థ్ ఓ కీలక పాత్ర పోషించారు. 15న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా వేశారు. ఈసారి పక్కాగా విడుదల చేస్తారని తెలుస్తోంది. పెళ్లి సందడి, రౌడీ బోయ్స్ సినిమాలూ ఈ సీజన్‌లోనే రాబోతున్నాయి. అయితే విడుదల తేదీలు ఇంకా ఖరారు కావల్సివుంది.