అభినయంతో కట్టిపడేయగల అతి కొద్ది మంది కథానాయికల్లో సాయి పల్లవి ఒకరు. ఫిదాలాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలతో చెరిగిపోని స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు `విరాటపర్వం`లో నటిస్తోంది. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర షాకిచ్చేలా ఉంటుందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఆ సినిమా సంగతి పక్కన పెడితే.. సాయి పల్లవి చేసిన కామెంట్లు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. పెళ్లి విషయంలో సాయి పల్లవి స్పందిస్తూ.. `నేనెప్పటికీ పెళ్లి చేసుకోను.. నేనెప్పుడూ నా తల్లిదండ్రులతోనే ఉండాలనుకుంటాను. పెళ్లయితే అది కుదరని పని. అందుకే పెళ్లి కి నేను దూరం` అంటూ షాకిచ్చింది.
తల్లిదండ్రులపై సాయి పల్లవికి ఉన్న ప్రేమకు ఎవరైనా సరే, ఫిదా అయిపోవాల్సిందే. కానీ.. ఆ కారణంతో పెళ్లి చేసుకోను అనుకోవడం కూడా సరైనది కాదు. తన ఇష్టాయిష్టాల్ని గౌరవించే భర్త దొరికితే.. సాయి పల్లవికి అంతకంటే అదృష్టం ఏముంటుంది? పెళ్లి పై విరక్తి రావడానికి వేరే కారణం ఉందని, సాయి పల్లవి ప్రేమ విషయంలో ఓ సారి మోసపోయిందని, అందుకే పెళ్లి వద్దు అంటోందని గుసగులలు మొదలైపోయాయి. ఏదేమైనా.. సాయి పల్లవి బ్రహ్మచారిణిగా ఉండిపోవాలని నిర్ణయించుకోవడం అభిమానులకు మింగుడుపడని విషయమే.