సాయిపల్లవి తో ‘ఏయ్‌ పిల్లా పోదామా..’ అంటోన్న చైతూ.!

By Inkmantra - March 11, 2020 - 17:03 PM IST

మరిన్ని వార్తలు

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో చైతూ, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘లవ్‌స్టోరీ’ నుండి ‘ఏయ్‌ పిల్లా..’ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ అయ్యింది. మొన్న రిలీజ్‌ చేసిన ఈ సాంగ్‌ శాంపిల్‌ ప్రోమో రికార్డు లు కొల్లగొట్టింది. లేటెస్ట్‌గా రిలీజైన ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌కీ మంచి రెస్పాన్స్‌ వచ్చేలానే ఉంది. పవన్‌. సి.హెచ్‌ మ్యూజిక్‌ అందించిన ఈ సాంగ్‌లోని చైతూ, సాయి పల్లవి జంట ఆకట్టుకుంటోంది. ప్లజెంట్‌గా అలరిస్తున్నాయి వీరిద్దరి స్టిల్స్‌. స్మైలీ ఫేసెస్‌తో ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నారు. క్యూట్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చైతూ తొలిసారి ఫుల్‌ లెంగ్త్‌లో తెంగాణా కుర్రోడిగా కనిపిస్తున్నాడు.

 

ఫస్ట్‌ గ్లింప్స్‌లో భాగంగా, ట్రైన్‌లో సాయి పల్లవి, చైతూని ముద్దాడిన సన్నివేశంలో చైతూ పండిరచిన హావభావాలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండీ హ్యూజ్‌ రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా రిలీజ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘ఫిదా’ సూపర్‌ హిట్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. చూడాలి మరి, ఆ అంచనాల్ని అందుకుంటుందో లేదో చైతూ ` సాయి పల్లవి ‘లవ్‌స్టోరీ’.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS