న్యూస్ విన్నా, చూసినా, ప్రతీ రోజూ అక్రమ సంబంధం కారణంగా భర్తను చంపిన భార్య. అదే అక్రమ సంబంధం కారణంగా భార్యను చంపిన భర్త.. ఇలాంటి వార్తలు చాలా సర్వసాధారణం అయిపోయాయిప్పుడు.
ఎప్పుడో ఎక్కడో నూటికో, కోటికో చాలా అరుదుగా జరిగే ఇలాంటి ఘటనలు చాలా సులువుగా మన పక్కిట్లోనో, ఎదురింట్లోనే, అక్కడి దాకా వస్తే, మనింట్లోనే జరిగిపోతున్నాయి. జరుగుతున్నాయి. వెంటనే మర్చిపోతున్నాం. ఇటీవల విన్నారుగా నవ వధువు భర్తను చంపించిన విధానం. పెళ్లైన పదిరోజులకే కాళ్ల పారాణి కూడా ఆరకుండానే అంటే ఇది పాత మాటే, చేతులకు పెట్టుకున్న మెహందీ కూడా పోకుండానే, స్నేహితులతో కలిసి ధైర్యంగా కొత్త పెళ్లికొడుకును చంపించేసింది ఓ మహిళ. దాన్ని హత్యగా క్రియేట్ చేసింది. ఇందుకు అక్రమ సంబంధమే కారణం.
ఇలా ఒక్కటి కాదు, చాలా చాలా.. అందుకే ఇదే కాన్సెప్ట్‌ని తీసుకుని బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్‌ని రూపొందించబోతున్నారు. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ వెబ్‌సిరీస్‌ని నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో నటించేది ఎవరో తెలుసా? ప్రముఖ నటీమణులు కైరా ఆద్వానీ, భూమి పడ్నేకర్, మనీషా కోయిరాల తదితరులు. ఈ వెబ్ సిరీస్‌ని నలుగురు డైరెక్టర్లు రూపొందిస్తుండడం విశేషం.
నాలుగు స్టోరీలు, నాలుగు క్లైమాక్స్‌లట ఈ వెబ్ సిరీస్‌కి. నలుగురు డైరెక్టర్లూ ప్రముఖ డైరెక్టర్లే. అక్రమ సంబంధాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సంచలనంగా మారింది. 'లస్ట్ స్టోరీస్' అనే టైటిల్‌తో రూపు దిద్దుకుంటోన్న ఈ వెబ్ సిరీస్ ముందు ముందు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలిక.