ప్రియా వారియర్‌ తెలుగు ఎంట్రీ షురూ.?

మరిన్ని వార్తలు

ఒక్క వీడియోతో ఏకంగా దేశం మొత్తం ఊపు ఊపేసింది ముద్దుగుమ్మ ప్రియా వారియర్‌. మలయాళంలో ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న 'ఒరు అదర్‌ లవ్‌' చిత్రంలోని ఓ టీజర్‌ సాంగ్‌ వీడియోతో దేశం మొత్తం పాపులర్‌ అయిపోయింది. 

ఏదో మామూలుగా విడుదల చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియా వేదికగా కనీ వినీ ఎరుగని స్థాయిలో ఇంత వైరల్‌ అయ్యేసరికి ఆ సినిమా గురించి భాషతో సంబంధం లేకుండా అందరికీ తెలిసిపోయింది. అందుకే ప్రియా వారియర్‌ నటించిన ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోందట. గతంలోనూ ఈ వార్త ప్రచారంలో ఉంది కానీ, అప్పటికి చిత్ర యూనిట్‌ ఇలాంటి యోచన చేయలేదు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు సన్నాహాలు చేస్తోందట. 

ఆల్రెడీ 'ఒరు ఆదర్‌ లవ్‌' తమిళ టీజర్‌ సాంగ్‌ని విడుదల చేశారు. దానికి మామూలుగా రెస్పాన్స్‌ రావడం లేదు. ఇప్పుడు ఇదే ట్రెండింగ్‌లో ఉంది. ఇక తెలుగులో కూడా విడుదలైతే ఈ అమ్మడికున్న క్రేజ్‌తో ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అవ్వడం సంగతి అటుంచితే, ఓపెనింగ్స్‌ మాత్రం భారీ స్థాయిలో వస్తాయనడం నిస్సందేహం అని చెప్పొచ్చు. సెప్టెంబర్‌లో ఈ సినిమాని విడుదల చేసేలా చిత్ర యూనిట్‌ రంగం సిద్ధం చేస్తోంది. 

చూడాలిక సింగిల్‌ వీడియోతోనే సెన్సేషన్‌ సృష్టించిన ప్రియా వారియర్‌ ఇక సినిమా విడుదలయ్యాక ఏ స్థాయిలో స్టార్‌డమ్‌ సంపాదిస్తుందో.!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS