సినీ పరిశ్రమను ఎవరికి నచ్చినట్లు వారు వాడేసుకుంటున్నారు. అనవసర ఆరోపణలతో తెలుగు ఇండస్ట్రీ పరువును బజారుకీడ్చేస్తున్నారు. ఇండస్ట్రీలో మగవాళ్ల కన్నా, ఆడవాళ్లతోనే ఎక్కువ ఇబ్బందులున్నాయంటూ కుండ బద్దలుకొట్టింది తాజాగా ఓ పాటల రచయిత్రి శ్రేష్ఠ. శ్రేష్ఠ అంటే ఎవరో పెద్దగా తెలియకపోవచ్చు. 'పెళ్లిచూపులు', 'అర్జున్‌రెడ్డి', అభిమన్యుడు' తదితర చిత్రాలకు పాటలను రాశారావిడ.
తాజాగా కాస్టింగ్‌కౌచ్‌పై తన స్పందనను తెలియజేస్తూ, ఇండస్ట్రీలో పలువురి కారణంగా తాను ఇబ్బంది పడ్డానని చెప్పింది. అంతేకాదు, హైద్రాబాద్‌లో తనకు రక్షణ లేదనీ, ప్రాణభయం ఉందనీ అనడం గమనించాల్సిన విషయం. ఛానెల్ డిస్కషన్ కోసం బయలుదేరుతుండగా, తన ఇంటి తలుపుకు బయటి నుండి ఎవరో గడియ పెట్టేశారట. క్యాబ్ డ్రైవర్ సాయంతో ఎలాగోలా తప్పించుకుని మీడియా ముందు ప్రత్యక్షమైందట. ఆ రకంగా ఇండస్ట్రీ నుండి తనకి ప్రాణ భయం ఉందన్న విషయాన్ని మీడియా ముఖంగా శ్రేష్ట తెలియజేసింది.
ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ విషయంలో ఇండస్ట్రీలో మగవారి నుండి కన్నా, ఆడవారి నుండే ఎక్కువ ఇబ్బంది ఉందనీ ఆమె సుస్పష్టంగా తెలిపింది. ఈ విషయంలో స్వయంగా ఆమె అనుభవాలను మీడియాతో పేర్కొంది. ఓ లేడీ డైరెక్టర్ కారణంగా ఆమె కాస్టింగ్ కౌచ్‌ని ఎదుర్కొన్నాననీ తెలిపింది.
అంతేకాదు, ఓ డైరెక్టర్ భార్య కూడా తనను వేధింపులకు గురి చేసిందనీ ఆమె పేరు బయటపెట్టేందుకు ఇష్టం లేదనీ శ్రేష్ఠ తెలిపింది. శ్రేష్ఠ వ్యాఖ్యలు ఇప్పుడు సంచనలనంగా మారాయి.