బండ్ల గణేష్ చిత్రపరిశ్రమలో నటుడిగా చాలాకాలం నుండి ఉన్నా సరే పెద్దగా గుర్తింపు పొందలేకపోయాడు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకి నిర్మాతగా బ్రేక్ ఇవ్వడంతో రాత్రికి రాత్రే బ్లాక్ బ్లస్టర్ నిర్మాతగా మారిపోయాడు.
ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ అంటే తనకి దైవం, ఆయన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం న్యూస్ ఛానల్స్ డిబేట్లలో ఆయనకి మద్దతుగా మాట్లాడడం చూస్తూనే ఉంటాము. అట్లాంటిది ఆయన ఈరోజు తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన ఒక ఫోటో ఏకంగా తాను దైవంగా భావించే పవన్ కళ్యాణ్ కి ఝలక్ ఇచ్చేదిలా ఉంది.
ఇంతకి ఆ ఫోటో ఏంటంటే- కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోని పెట్టి దేశ భవిష్యత్తు మీచేతిలోనే ఉంది అంటూ కామెంట్ పెట్టాడు. ఇది ఇప్పుడు పెద్ద చర్చకి దారితీసింది.పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీతో విరోధం ఉంది అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆయన ప్రచారం నిర్వహించడం కూడా చూసాము.
ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కి వీరాభిమాని, వీర విధేయుడు, అనుచరుడు, సన్నిహితుడు అయిన బండ్ల గణేష్ ఇలా ఒక్కసారిగా రాహుల్ తో ఫోటో పెట్టి భవిష్యత్తు మీరే అనడం ఒకరకంగా పవన్ కి ఝలక్ అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అదేలే.. ఈరోజుల్లో రాజకీయం అంటే ఒక ఊహించని మలుపులకి కేర్ అఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇది కూడా అందులో ఒక భాగమనే చెప్పాలి.