గతంలో ఎన్నడూ లేనంత సెగ ఈసారి మా ఎన్నికల్లో కనిపించింది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్ మధ్యహాట్ హాట్ హాట్ పోటీ వాతావరణం కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో నడిచినట్లు ఓటుకు నోటు, రిసార్ట్ రాజకీయాలు కూడా నడిచాయి. పోలింగ్ రోజు కూడా మా ఎన్నికలు మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి. చిరంజీవి బాలకృష్ణ, రామ్ చరణ్, నాగార్జున లాంటి స్టార్ హీరోలు తొలి గంటలోనే తమ ఓటు హక్కుని వినియోగించకున్నారు. తమ అభిప్రాయాలని మీడియాతో పంచుకున్నారు.
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని.. అన్నిసార్లు ఇదే స్థాయిలో వాడీవేడిగా ఎన్నికలు జరగుతాయని తాను అనుకోవడం లేదని, భవిష్యత్‌లో ఇలా జరగకుండా తమ ప్రయత్నాలు చేస్తామని చిరంజీవి చెబితే.. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణులు తనకు అన్నదమ్ముల్లాంటి వారని, రెండు ప్యానెళ్ల ఉత్సాహం చూస్తుంటే ఇండస్ట్రీకి మంచి చేసేటట్లు కనిపించారని, ఇరు ప్యానెల్స్‌లో ఎవరు మంచి చేస్తారో వారికే ఓటు వేశానని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. తాను ఎవరికి మద్దతుగా నిలిచానో చెప్పడం ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని, రాజకీయాలపై ‘మా’ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపవని పవన్ కళ్యాణ్ అన్నారు
ఇక ఈసారి పోలింగ్ శైలి చుస్తే ఈసారి మా చరిత్రలో లేనంత ఎక్కువ ఓటింగ్ శాతం నమోదౌతుందని అంచాన. వాడీవేడీగా పోలింగ్ జరిగింది . పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ తీరుపై మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. నమూనా బ్యాలెట్ ఇస్తున్న శివారెడ్డిని శివబాలాజీ అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి స్వల్పం ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సారి మా’ ఎన్నికల పోలింగ్ గడువు కూడా పెంచారు. ఓటు వేసేందుకు సభ్యులు ఇంకా వస్తున్నందున ప్యానళ్ల అభ్యర్థన మేరకు మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్ ముగియాల్సి ఉన్నప్పటికీ మరో గంట పాటు పోలింగ్‌కు ఎన్నికల అధికారి అవకాశం కల్పించారు.
పోలింగ్ కేంద్రం వద్ద నటి హేమా, శివబాలాజీ ల కొడుకుడు వివాదం మీడియాలో వైరల్ అయ్యింది. శివబాలాజీ చేతిని హేమ కొరికిందని నరేష్ మీడియాకి చెప్పారు. దీనిపై హేమ స్పందిస్తూ.. తాను వెళ్తున్న క్రమంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. శివబాలాజీ స్పందిస్తూ.. పోలింగ్ కేంద్రం వద్ద అక్రమంగా ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకోబోయి బ్యాలన్స్ తప్పి అక్కడే వున్న రెండు పోల్స్ ని పట్టుకున్నానని .. ఇంతలో హేమ నా చేయి కొరికిందని'' చెప్పుకొచ్చాడు. మొత్తానికి పోలింగ్ రోజు కూడా మా ఎన్నికలు హోరాహోరీగానే జరిగాయి. ఎన్నడూలేనంత మా ఎన్నికల వేడి ఈ ఎన్నికలో కనిపించింది. ఈ సాయంత్రమే ఫలితం వెల్లడౌతుంది.