ప్రభాస్ 25వ చిత్రానికి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. అందరూ ఊహించినట్టుగానే ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. సినిమా పేరు కూడా ప్రకటించేశారు. స్పిరిట్ అనే వైవిధ్యభరితమైన పేరు పెట్టారు. సందీప్ రెడ్డి వంగా అంటే.. కచ్చితంగా సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందన్నది అందరి ఆశ. పైగా ఇది మరో పాన్ ఇండియా మూవీ. కాబట్టి.. తొలి ప్రకటనతోనే అంచనాలు మొదలైపోయాయి.
అయితే.. ఇప్పుడు ఈ సినిమా కథపై ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ కథని ఇప్పటికి ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేశార్ట. వాళ్లు కాదన్న తరవాతే ఈ కథ.. ప్రభాస్ దగ్గరకు వచ్చిందట. ఈ కథని ముందు మహేష్ బాబు కి వినిపించాడు సందీప్ రెడ్డి. ఆ తరవాత రామ్ చరణ్, అల్లు అర్జున్ దగ్గరకీ వెళ్లిందట. వాళ్లు కూడా కాదన్న తరవాతే.. ప్రభాస్ విన్నాడని సమాచారం. మరి ముగ్గురు హీరోలు కాదన్న కథలో.. ప్రభాస్ ఏం చూశాడో? అర్జున్ రెడ్డి కథ కూడా చాలామంది హీరోల చుట్టూ తిరిగింది. చివరికి విజయ్ దేవరకొండ ఓకే చేశాడు. ఆ సినిమా విజయ్ ని సూపర్ స్టార్ ని చేసేసింది. అందుకే ... ఏకథలో ఎంత దమ్ముందో చెప్పలేం. సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ ఓపిక పట్టాల్సిందే.