`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవలే హైదరాబాద్ లో టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో అంగరంగవైభంగా కర్టైన్ రైజర్ వేడుక జరిగింది. తాజాగా `మా` విదేశాల్లో సెలబ్రేట్ చేసేందుకు కూడా ముహూర్తం పెట్టేసింది. ఏప్రిల్ 28న అమెరికా డల్లాస్ లో తొలి ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హజరవుతున్నట్లు `మా` అద్యక్షుడు శివాజీ రాజా సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈవెంట్ ను ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్- తిరుమల ప్రొడక్షకన్స్ ప్రైవెట్ లిమిటెడ్ సంయుక్తగా అమెరికాలో నిర్వహిస్తున్నాయి.
`మా` కోసం ఎతకష్టమైనా పడటానికి నేను..మాటీమ్ సిద్దంగా ఉన్నాం. ఆ మధ్య కర్టైన్ రైజర్ వేడుకలో నాజర్ గారు `మా` అసోసియేషన్ మాకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఆ మాట నాకు ఎంతో ఉత్సాహాన్ని... ధైర్యాన్ని, సంతోషాన్నిచ్చింది. అలాగే పరభాషా హీరోయిన్లు అయినా...మన తెలుగు హీరోయిన్లు అయినా సరే కచ్చితంగా `మా` లో మెంబర్ షిప్ తీసుకోవాలి.
ఏదైనా సమస్య వచ్చిందంటే `మా` ముందకు వస్తున్నారు గానీ, అప్పటివరకూ మేము గుర్తు రావడం లేదు. ఆ సమయంలో ఒక చేత్తో `మా` మెంబర్ షిప్ ఫారమ్...మరో చెత్తో కంప్లైట్ ఫారమ్ తీసుకుని వస్తున్నారు. పరిస్థితి అంతవరకూ తెచ్చుకోవద్దని కోరుకుంటున్నా. ఇప్పటికే మేము చాలా సార్లు బతిమిలాడి చెబుతూనే ఉన్నాము అయిన సరే కొంతమంది హీరోయిన్లు మాట వినటంలేదు అని చెప్పుకొచ్చాడు.
అలా కాకుండా తోక జాడిస్తే ఆ తోకలు కత్తిరిస్తాము అంటూ ఘాటు వ్యాఖ్యలు సైతం చేయడం గమనార్హం. ఏదేమైనా ఇప్పుడు మా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.