మ్యాడ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: మ్యాడ్

నటీనటులు: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్

దర్శకత్వం: కళ్యాణ్ శంకర్


నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
 
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: శామ్‌దత్ - దినేష్ కృష్ణన్ బి
కూర్పు: నవీన్ నూలి


బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
విడుదల తేదీ: 6 అక్టోబర్ 2023

 

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 3/5

 

కాలేజీ నేపధ్యంలో సాగే కథలకి ఎప్పుడూ గిరాకీ వుంటుంది. ఇప్పుడు థియేటర్స్ కి వచ్చి సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో ఎక్కువ యువతే కాబట్టి దర్శక, నిర్మాతలు కూడా కాలేజీ కథ అంటే మొగ్గుచూపుతుంటారు. నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రలో కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన ‘మ్యాడ్‌’ కూడా కాలేజీ కథనే. మరి ఈ కథ ప్రేక్షకులకు ఎలాంటి వినోదాల్ని పంచింది. కుర్రాలు చేసిన సందడి ఎంతలా ఆకట్టుకుంది ? 


కథ: ఒకే  కాలేజీలో చదువుకున్న ముగ్గురి స్నేహితుల కథ ఇది. మనోజ్( రామ్ నితిన్) అశోక్ ( నార్నే నితిన్) దామోదర్ ( సంగీత్‌ శోభన్‌) ఈ ముగ్గురిదీ ఒకే కాలేజ్, హాస్టల్. నాలుగేళ్ళ ఇంజనీరింగ్ లో వారికి ఎదురైన కాలేజీ అనుభవాలు, ప్రేమలు, సరదాల సమాహారమే ఈ కథ.


విశ్లేషణ: తెలుగులో కాలేజీ నేపధ్యంలో సాగే సినిమాలకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది హ్యాపీ డేస్. దిని తర్వాత కాలేజీ నేపధ్యంలో ఎలాంటి సినిమాలు వచ్చినా ఎక్కడోదగ్గర హ్యాపీ డేస్ తో పోలిక వస్తుంది. ‘మ్యాడ్’లో  కూడా అలాంటి కొన్ని పోలికలు కనిపించాయి. ముగ్గురు స్నేహితులు, వాళ్ళ పరిచయాలు, అల్లరి, ర్యాగింగ్ ఇవన్నీ తెరపై చూస్తునపుడు.. ఇదివరకూ వచ్చిన కొన్ని సినిమాల రిఫరెన్స్ లు కనిపిస్తాయి కానీ సరదా సాగిపోతాయి. అలాగే బాలీవుడ్ సినిమా చిచోరే స్ఫూర్తి కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. హాస్టల్ లో క్యాంటీన్, అక్కడ ఎంట్రీ కోసం బాస్కెట్ బాల్ ఆడటం, దాని కోసం ప్రిపరేషన్ .. ఇవన్నీ తెరపై చూస్తున్నపుడు చిచోరే టెంప్లెట్ ని గుర్తుకుతెస్తుంది.
 

నిజానికి ఇందులో చెప్పడానికి కథ ఏమీ లేదు. అలాగే హ్యాపీ డేస్ లా ఒక జర్నీ కూడా వుండదు. చెప్పడానికి కథ లేనప్పుడు.. వినోదంతో  కాలక్షేపం చేయించే నేర్పు వుండాలి. ఈ విషయంలో మ్యాడ్ దర్శకుడు చాలా వరకూ పై చేయి సాధించాడు. కథతో సంబంధం లేకుండా యూత్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ రాసుకున్నాడు. ఇది చాలా చోట్ల వర్క్ అవుట్ అయ్యింది. పాత్రల పరిచయం తర్వాత ఇందులో అసలు కథ ఏమిటనే ప్రశ్న తలెత్తనివ్వకుండా కొన్ని టైం పాస్ కామెడీ సీన్స్ రాసుకున్నాడు. అందులో కొన్ని ఫోర్స్ ఫుల్ గా వున్నప్పటికీ ఇంకొన్ని ఆర్గానిక్ గా నవ్వించాయి.


ఇక ఇంటర్వెల్ మలుపు కోసం ఓ అజ్ఞాతప్రేమికురాలి ట్రాక్ ని ప్రవేశపెట్టాడు. ఆ క్రమంలోని కొన్ని సీన్స్ లో నవ్వించగలిగారు. సెకండ్ హాఫ్ లో కూడా ఇదే ట్రాక్ తో బండి నడిపేశారు.  అబ్బాయిలు అమ్మాయిల హాస్టల్ లోకి వెళ్ళే సీన్స్ కాస్త అతిగా అనిపించినా యూత్ ని ద్రుష్టిలో పెట్టుకొని ఈ సన్నివేశాలని రాసుకొని,  వాళ్ళుకు నచ్చే తీరుగానే తీర్చిదిద్దారు. అలాగే అజ్ఞాతప్రేమికురాలి కోసం దామోదర్ పడే తపన, లడ్డు పాత్ర చేసిన వినోదం, అఇన్స్టా, పేస్బుక్స్ లోని వైరల్ వీడియోలు ఆధారంగా రాసుకున్న జోక్స్ తో సెకండ్ హాఫ్ ని కూడా సరదాగానే లాగించేశారు. చివర్లో అజ్ఞాత ప్రేమికురాలి ట్విస్ట్ రివిల్ ఆయన విధానం కాస్త క్రింజ్ అనిపించినా కుర్రతనం అనుకోవాల్సిందే. 


నటీనటులు: దామోదర్ పాత్ర చేసిన సంగీత్ శోభన్ కి మంచి మార్కులు పడతాయి. సూపర్ టైమింగ్ తనది. డైలాగులో కొత్తదనం లేకపోయినా తన టైమింగ్ చాలా సీన్స్ ని పండించాడు. అలాగే రామ్ నితిన్, నార్నే నితిన్ పాత్రలు కూడా ఓకే అనిపిస్తాయి. లడ్డుగా చేసిన నటుడు ఆకట్టుకుంటాడు. గౌరీ, అంకిత, గోపిక కొత్త అమ్మాయిలు. రిజిస్టర్ అవ్వరు కానీ ఆ కాలేజీ కథలో సరిపోయారు. రఘుబాబు, మురళీధర్ కనిపించినప్పుడల్లా నవ్విస్తారు. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి. 


టెక్నికల్:  బీమ్స్ అందించిన పాటల్లో  కాలేజీ పాప సాంగ్ రిజిస్టర్ అవుతుంది, నేపధ్య సంగీతం మాత్రం ఓ కాలేజీ కథలా కాకుండా పంక్తు కమర్షియల్ సినిమాకి కొట్టినట్లుగా వుంది. కెమరాపనితనం నీట్ గా వుంది. కథకు తంగిన నిర్మాణం విలువలు కనిపించాయి. డైలాగ్స్ కొన్ని ద్వందర్ధాలు వున్నాయి. చెప్పుదగ్గ కథ లేకపోయినా కాలేజీ కుర్రాళ్ళకు కాలక్షేపం అయ్యే మసాలా ‘మ్యాడ్’ లో వుంది. ఇక బాక్సాఫీసు వద్ద నిలదొక్కుకోవడం కూడా వాళ్ళ ఆదరణపైనే ఆధారపడివుంది.

 

ప్లస్ పాయింట్స్ 

కాలేజీ ఫన్ 
 సంగీత్ శోభన్ 


మైనస్ పాయింట్స్ 

కథ లేకపోవడం 
కొన్ని రొటీన్ జోక్స్ 

 

ఫైనల్ వర్దిక్ట్ : కుర్రాళ్ళు నవ్విస్తారు...


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS