బోయపాటి శ్రీను సినిమాలకు ఒక మార్క్ వుంటుంది. మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని సమపాళ్లలో వాడుకొని ఎమోషన్స్ రాబట్టడం ఆయన స్పెషాలిటీ. ఇప్పుడు రామ్ పోతినేనితో 'స్కంద' సినిమా చేశారు. పూర్తి బోయపాటి మార్క్ సినిమా ఇది. బోయపాటి సినిమాలపై ఒక విమర్శ వుంటుంది. లాజిక్ లెస్ యాక్షన్ సీన్స్ ఉంటాయని. స్కంద పై కూడా అలాంటి కామెంట్స్ వచ్చాయి. అయితే బోయపాటి సినిమాలు విమర్శకుల కామెంట్స్ దాటి బాక్సాఫీసు వద్ద మ్యాజిక్ చేస్తుంటాయి. ఇప్పుడు స్కంద విషయంలో కూడా ఇది రుజువైయింది.
స్కంద కాస్త మిక్స్డ్ టాక్ తో మొదలైయింది. ఐతే అప్పటికే రామ్ కెరీర్ లో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో మొదలైయింది. సెలవులు కూడా కలసిరావడం అన్నీ ఎలిమెంట్స్ వున్న సినిమా కావడంతో బాక్సాఫీసు వద్ద స్కంద సందడి కొనసాగింది. రెండు రోజుల్లోనే దాదాపు 60 కోట్ల గ్రాస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది స్కంద. మాస్ సినిమాలకి వున్న అడ్వాంటేజ్ ఇదే. అన్ని ఎలిమెంట్స్ వున్న సినిమాలని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. స్కంద విషయంలో ఇది మరోసారి రుజువైయింది.