ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటోంది మాధవీలత. ఓ ఫౌండేషన్ ద్వారా తన వంతు సేవ అందిస్తోంది. సోషల్ మీడియాలో ఉంటే... కొత్త తలనొప్పులు వస్తుంటాయి. కామెంట్స్ ట్రోలింగ్స్ తో విసిగిస్తుంటారు యాంటీ ఫ్యాన్స్. ఈరోజు.. మాధవీలత ఓ పోస్ట్ చేసింది. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఓ కుర్రాడికి ఒక నెల మందుల కోసం సాయం చేయండి అంటూ ఫేస్ బుక్ పేజీలో అభ్యర్థించింది. నిజానికి మాధవీలత మంచి ఉద్దేశంతోనే ఈ పోస్ట్ పెట్టింది. వీలైతే సాయం చేయాల్సింది పోయి, కొంతమంది `నువ్వేం చేస్తున్నావ్.. నువ్వు ఇవ్వొచ్చు కదా` అంటూ ఎటకారంగా కామెంట్లు పెట్టారు. దాంతో మాధవీలతకు కోపం వచ్చేసింది.
`మీరెవర్రా నాకు చెప్పడానికి` అంటూ వాళ్లపై ఫైర్ అయ్యింది. సాయం చేయకపోగా, ఇలాంటి పిచ్చి కామెంట్లు పెడుతున్నవాళ్లు వీధి కుక్కలతో సమానమని, తన దగ్గర డబ్బుల్లేవు కాబట్టే... సాయం చేయమని అభ్యర్థించానని, దాన్ని కూడా నెగిటీవ్ దృష్టితో చూసినవాళ్లు కుక్కలతో సమానమని, అలాంటి వాళ్లందరినీ బ్లాక్ చేస్తున్నానంటూ.. ఫైర్ అయ్యింది మాధవీలత.