బిగ్ బాస్ లో నిన్న జరిగిన ఎలిమినేషన్ పై నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ప్రేక్షకులు వేసే ఓట్లకు పెద్దగా విలువ ఉండదని, నిన్న నూతన్ నాయుడు ఎలిమినేట్ కావటంతో ఇది రుజువైందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బిగ్ బాస్ లో మరో కంటెస్టెంట్ అమిత్ కంటే నూతన్ నాయుడు కి ఎక్కువ ఓట్లు వచ్చినా, నూతన్ ని ఎలిమినేట్ చేయటం దారుణమని పేర్కొంది. కేవలం హౌస్ లో రెండుసార్లు రీ ఎంట్రీ ఇచ్చాడనే కారణంగానే నూతన్ ని బయటికి పంపించారని ఆరోపించింది. అమిత్ ని ఫైనల్ విన్నర్ చేసినా షాక్ అవ్వొద్దని పేర్కొంది. కేవలం ఈ షోని చూసి ఆనందించటానికే పరిమితం కావాలని సూచించింది. ఈమె చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తుంది.
ఇక బిగ్ బాస్ హౌస్ లో సామాన్యుడి కోటాలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎలిమినేట్ అయ్యారు. గణేష్ శనివారం ఎలిమినేట్ కాగా, ఆదివారం నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యారు.