బిగ్ బాస్ సీజన్ మొత్తంలో ఇద్దరు సభ్యులు మాత్రం తమ ఉనికిని చాలా బాగా చాటుకోగలిగారు. వారే కౌశల్ & గీత మాధురి.
ఈ ఇద్దరిలో అయితే తొలి నుండి కూడా కౌశల్ గేమ్ పైనే దృష్టి పెడుతూ ఇంటిలోని మిగతావారి నుండి విమర్శలు ఎదురుకున్నప్పటికి కూడా తన ఫోకస్ ని ఆటపైనే పెట్టి ముందుకు సాగుతున్నాడు.
ఇక గీత విషయానికి వస్తే, కౌశల్ ఆటతీరుకి పూర్తి వ్యతిరేకం అనే చెప్పాలి. అయినప్పటికి కూడా తన సమయస్పూర్తితో, ఎటువంటి క్లిష్ట సమయంలోనైనా క్లారిటీ తో మాట్లాడుతూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోగలిగింది. సీజన్ పూర్తయ్యేందుకు ఇంకొక మూడు వారలే ఉన్నందున దాదాపుగా ఈ సీజన్ ని ఎవరు గెలుచుకుంటారు అన్న అభిప్రాయలు, అంచనాలు మొదలైన తరుణంలో ఎక్కువమంది ప్రేక్షకులు కౌశల్ & గీత మాధురి పేర్లే చెబుతున్నారు.
అయితే వీరిమధ్య మాత్రం ఒక్క విషయంలో కూడా ఏకాభిప్రాయం లేదనే చెప్పాలి. ఇప్పటికి కూడా ఏదో ఒక అంశం పైన మాటలు విసురుకుంటూనే ఉన్నారు. ఇద్దరు కూడా గేమ్ ఆడే వారితోనే గేమ్ ఆడాలి అని గీత చెప్పగా ఆ సవాలుని నేను స్వీకరిస్తాను అని చెప్పాడు కౌశల్.
ఇక షో చూస్తున్న వీక్షకులలో కౌశల్ కి మద్దతుగా కౌశల్ ఆర్మీ అని కొందరు ఉంటే మరికొందరు యాంటీ కౌశల్ ఫ్యాన్స్ గా ఉన్న వారు గీత మాధురి కి మద్దతు తెలుపుతున్నారు.
ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..