ముద్దంటే వద్దంటోన్న 'ప్రేమమ్‌' బ్యూటీ

మరిన్ని వార్తలు

ఒకప్పుడు హీరోయిన్స్‌ అంటే స్కిన్‌ షో కంపల్సరీ. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. స్కిన్‌ షో కన్నా, యాక్టింగ్‌ టాలెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా తమ యాక్టింగ్‌ టాలెంట్‌తో వరుస అవకశాలు దక్కించుకుంటూ, హీరోయిన్స్‌గా ప్రశంసలు దక్కించుకుంటున్నా ముద్దుగుమ్మలు కూడా చాలా మందే ఉన్నారిప్పుడు. 

నిత్యా మీనన్‌, సాయి పల్లవి, అనుపమా పరమేశ్వరన్‌, కీర్తి సురేష్‌ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే ఉంది. అయితే ఈ లిస్టులోనిదాన్నే తాను కూడా అంటోంది ముద్దుగుమ్మ మడోనా సెబాస్టియన్‌. 'ప్రేమమ్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే ఈ ముద్దుగుమ్మ. బేసిగ్గా యాక్టింగ్‌ టాలెంట్‌తో పాటు సింగింగ్‌ టాలెంట్‌ కూడా ఉందీ భామకి. అయితే తెలుగులో 'ప్రేమమ్‌' తప్ప మరో సినిమాలో కనిపించింది లేదు ఈ నేచురల్‌ బ్యూటీ. 

అందుకు కారణం ఏంటంటే, అమ్మడు గ్లామర్‌కి చాలా దూరమంట. ముఖ్యంగా ముద్దు సీన్లలో నటించడం అంటే అస్సలు ఇష్టముండట. నేచురల్‌గా మలయాళ కుట్టీలంతా గ్లామర్‌కి దూరమే అంటున్నారిప్పుడు. అయితే గ్లామర్‌కి నో అన్నా, మలయాళ కుట్టీలు హాట్‌ హాట్‌ ఆఫర్స్‌ అందుకోవడంలో ముందుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌కి మలయాళ కుట్టీలంటే కొంచెం ప్రేమెక్కువే. అలా కాబట్టే, గ్లామర్‌కి నో అన్నా, కీర్తి సురేష్‌ తదితరులు ఇక్కడ స్టార్‌ హీరోయిన్స్‌ దిశగా పరుగులు పెడుతున్నారు. 

అలా మడోనాకి అవకాశాలు ఎందుకు రావడం లేదో తెలీదు కానీ, ప్రస్తుతం మలయాళ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోందీ ముద్దుగుమ్మ. మంచి ఆఫర్‌ వస్తే, మిగిలిన మలయాళ కుట్టీల్లాగే తెలుగులో తాను కూడా అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటోంది.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS