భాను శ్రీ బిగ్ బాస్ నుండి వెళ్ళిపోవడానికి కారణం ఇదే!

By iQlikMovies - July 16, 2018 - 13:20 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ ఇంటి నుండి భాను శ్రీ  వెళ్ళిపోవడమనేది నిన్న బిగ్ బాస్ ఇంటి సభ్యులకే కాక షో చూస్తున్న వీక్షకులు కూడా షాక్ కి గురయ్యారు.

అయితే షో ముందు నుండి చూస్తున్నవారికి భాను శ్రీ కచ్చితంగా టాప్ 5లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్న భావన అందరిలోనూ ఉండేది, కాని నిన్నటి ఎలిమినేషన్ అందరికి మింగుడు పడని నిజంగా మారింది. ఈ ఎలిమినేషన్ పూర్తిగా గమనిస్తే, భాను శ్రీ బయటకి వెళ్ళడానికి కారణం మొన్న హౌస్ లో జరిగిన “మంచి-చెడు” టాస్క్ లో భాను శ్రీ ప్రవర్తించిన తీరు ఆమెకి శాపంగా మారింది!

ఆ సమయంలో కౌశల్ పైన చేసిన కామెంట్స్, వాడిన పదజాలాన్ని ఇంటి సభ్యులు తప్పు పట్టడమే కాకుండా ఇంటి బయట నుండి చూసే వీక్షకులు కూడా ఆమెకి ఓట్ల రూపంలో తమ వ్యతిరేకతని తెలిపారు.

మూడవ వారంలో బయటకి వచ్చిన కిరీటి కూడా కౌశల్ పట్ల ప్రవర్తించిన తీరుకి ఆయన ఇంటి బయటకి రావడం జరిగింది. ఇక ఒకే సీజన్ లో ఇలా కౌశల్ తో తప్పుగా వ్యవహరించిన తీరుకి ఎలిమినేషన్ అవ్వాల్సి రావడం గమనార్హం.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS